1990 లోతమిళ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరోల్లో ప్రశాంత్ ఒకడు. అరడుగుల ఆజానుభావుడు మాత్రమే కాదు, మంచి రొమాంటిక్ హీరో కూడా. తెలుగు, మలయాలం, కన్నడ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. నటి రోజా భర్త సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన చామంతి సినిమాలో రోజా, ప్రశాంత్ ఇద్దరు హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఉండడం విశేషం. ఆ తరువాత క్రియేటివ్ దర్శకుడు మణిరత్నం తీసిన దొంగ దొంగ సినిమాలో హీరోగా నటించాడు. అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమాలో కూడా ప్రశాంత్ నే హీరో. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ నటించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మాటల్లో చెప్పలేము. ఈ సినిమాలో హీరో పాత్ర అమోఘం. ఎందుకంటే ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించాడు.

ఆ తరువాత తొలి ముద్దు సినిమాలో దివ్య భారతి సరసన హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం దివ్య భారతి మరణానికి ముందే నటించిన చిత్రంగా రికార్డు సంపాదించుకుంది. అయితే దివ్యభారతి చనిపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో దివ్యభారతి పోలికలు ఉన్న రంభను డూప్ గా పెట్టుకుని సినిమా పూర్తి చేశారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రశాంత్ 17 ఏళ్ల వయసులో కోర మీసాలతో అందరిని ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ అందాన్ని చూసి అందరు నివ్వెరపోయేవారట. ఇంకా తెలుగులో తనకంటూ ఒక మాస్ ఇమేజ్ ను సంపాదించుకోవడానికి లాఠీ, ప్రేమ శిఖరం, సాహసం సినిమాల్లో నటించాడు. ఇంకా హిందీలో అనుఖా, ప్రేమయుద్, ఐ లవ్ యు సినిమాల్లో కూడా నటించాడు. అలాగే ఇంకా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించాడు. కెరీర్ మంచిగా ముందుగా సాగె సమయంలో ఉన్నటుండి పూర్తిగా కిందకు జారిపోయాడు. అలాగే ప్రశాంత్ వాస్తవానికి హీరో విక్రమ్ కి కజిన్ అవుతాడు. అయితే అప్పట్లో ఈ హీరో చిత్రసీమలో ఒక వెలుగు వెలుగుతూ ఉండాలిసింది కానీ అలా జరగలేదు. హీరో సిద్దార్ధ, మాధవన్ స్థాయిలో అయిన ఉండేవాడని కోలీవుడ్ వర్గాలు అప్పట్లో అనేవారు.

2000 దశకంలో ప్రశాంత్ కథానాయకుడిగా చాలా సినిమాలు ప్రారంభమయ్యాయి కానీ వాటిలో చాలావరకు మధ్యలోనే ఆగిపోయాయి. అలానే ప్రశాంత్ సినీ జీవితం మధ్యలో ఆగిపోవడానికి, ఉన్నట్టుండి కెరీర్ దెబ్బతినడానికి అయన తండ్రి త్యాగరాజన్ కారణం అని పలు పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో ప్రశాంత్ కి చాలా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ ఏ దర్శక నిర్మాత డైరక్ట్ గా ప్రశాంత్ ను కలవలేకపోయేవారు. ఎందుకంటే ప్రశాంత్ కి సంబంధించిన అన్ని విషయాలు తన తండ్రి త్యాగరాజన్ చూసుకునేవాడు. అలాగే ఏదన్న సినిమా హిట్ అవ్వడంతో ఉన్నటుండి ప్రశాంత్ రెమ్యూనిరేషన్ పెంచేసేవాడు. దీనితో ప్రశాంత్ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు వెనకాడేవారు. తరువాత ఒక కోటీశ్వరురాలతో ప్రశాంత్ పెళ్లి జరిగింది.

కానీ ప్రశాంత్ పెళ్లి అయిన కూడా తండ్రి చాటు బిడ్డలాగానే అయన చెప్పుచేతల్లోనే ఉండేవాడు. దీనితో విసిగిపోయిన ప్రశాంత్ భార్య ఒకానొక సందర్బంలో నీకు తండ్రి కావాలా.. భార్య కావాలా అని అడగడంతో చాలారోజులు షాక్ లో ఉండిపోయాడట. ఫైనల్ గా తండ్రి నిర్ణమయానుసారం భార్య కి విడాకులు ఇచ్చేసాడు. తన సినీ జీవితంలో గాని, నిజ జీవితంలో గాని ప్రశాంత్ తండ్రి తీసుకున్న నిర్ణయాలు ఆయన్ని పాతాళంలోకి తొక్కేశాయి. ఎన్నో సంవత్సరాల సుస్థిర విరామం తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు . రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ లో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. అయితే అప్పటి జీన్స్ చిత్రంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రశాంత్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోగా నటించిన ప్రశాంత్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. సరైన విజయాలు దక్కకపోవడం వలనే ప్రశాంత్ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here