ఒకప్పుడు కుర్రాళ్ళ కు నిద్ర లేకుండా చేసిన అందాల డ్యాన్సర్ జయమాలిని. అందరిలాగే హీరో నరసింహరాజుకు కూడా ఆమె అంటే చాలా ఇష్టం. జయమాలిని పేరుకు మాత్రమే వ్యాంపు క్యారెక్టర్ లేదా ఐటమ్ సాంగ్స్ చేసిన తన ప్రవర్తన లో ఎలాంటి అసభ్యత ఉండదని నరసింహ రాజు చెప్పుకొచ్చారు. అలా 1978లో విఠలాచార్య దర్శకత్వంలో నరసింహరాజు, జయమాలిని ప్రభ హీరో, హీరోయిన్లుగా జగన్మోహిని తీస్తున్న సమయంలో అభ్యుదయ భావాలతో, సామాజిక స్థితిగతులకు అద్దం పట్టే పునాదిరాళ్లు సినిమా రాజ్ కుమార్ దర్శకత్వంలో విడుదలయింది.

ఇందులో ఐదు పాత్రల లీడ్ రోల్స్ తో పునాదిరాళ్లు సినిమా కొనసాగుతోంది. ఈ సినిమాలో చిరంజీవి ఐదుగురిలో ఒకరుగా కనిపించగా, నరసింహరాజు అప్పటికే నీడలేని ఆడది, తూర్పు పడమర లాంటి విజయవంతమైన చిత్రాలు చేయడంతో ఆయనకి ప్రధాన పాత్ర ఇవ్వడం జరిగింది. 1980 ఏ.వి.ఎమ్ ప్రొడక్షన్స్ లో రాజశేఖర్ దర్శకత్వంలో నరసింహ రాజు, చిరంజీవి, రతి అగ్నిహోత్రి కలిసి నటించారు. ఇందులో నరసింహరాజు హీరోగా నటించగా చిరంజీవి విలన్ గా నటించారు. పాము నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత 1986 సంవత్సరం వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్లో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాతగా విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, జయసుధ హీరో, హీరోయిన్లుగా మగధీరుడు సినిమా విడుదలయ్యింది.

విచిత్రమేమంటే ఈ సినిమాలో హీరోగా చిరంజీవి నటించగా విలన్ గా నరసింహరాజు ఓ పాత్ర చేయడం జరిగింది. 1978 పునాదిరాళ్ళు చిత్రంలో నరసింహరాజు నటిస్తున్నప్పుడు చిరంజీవి షూటింగ్ విరామంలో టేప్ రికార్డర్ లో ఒక సాంగ్ పెట్టుకొని డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడని అలా ఆయన డాన్స్ ను చూసిన ఆ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ పునాదిరాళ్లు సినిమాలో చిరంజీవికి ఒక పాట పెట్టారని నరసింహరాజు చెప్పుకొచ్చారు.

అలా 1993 సంవత్సరం వచ్చేసరికి నరసింహరాజుకి పూర్తిగా సినిమా అవకాశాలు తగ్గాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితులను నెట్టుకు రావడానికి నరసింహరాజు వెండితెర నుంచి బుల్లితెరవైపు చూడడం జరిగింది. తన ఇద్దరు పిల్లలు పెరిగి పెద్ద వారు కావడంతో వారికి పెళ్లి చేసారు. ఇప్పటికీ తెలుగు తమిళ సీరియల్స్ లో నటిస్తూ, ఖాళీ సమయాల్లో గతస్మృతులను గుర్తుచేసుకుంటూ.. నరసింహరాజు తన వృద్ధాప్య జీవితాన్ని గడుపుతున్నారు.































