వారసుడు చిత్రం, ఆ తర్వాత తిరిగి నాగార్జున తో హలోబ్రదర్ సినిమాని దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ రూపొందించాడు. ఆ సినిమా ప్రివ్యూ కి వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసి ఈవీవీ సత్యనారాయణను అభినందించారు. ఆ తర్వాత మనిద్దరం కలిసి ఒక సినిమా తీద్దాం అని చెప్పడంతో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఎంతో ఆనందించారు. తాను ఎప్పటినుంచో చిరంజీవితో సినిమా తీయాలని కలలు కంటున్నాడు. అది కాస్తా హలో బ్రదర్ హిట్ కావడంతో చిరంజీవితో సినిమా తీసే అవకాశం ఇవివి సత్యనారాయణకు వచ్చింది. ఎలాగైనా మెగాస్టార్ చిరంజీవికి ఒక సూపర్ హిట్ సినిమా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

ఆ క్రమంలో రచయిత పోసాని కృష్ణ మురళి ఒక అద్భుతమైన కథని అందించాడు. దేవివరప్రసాద్ నిర్మాణ సారథ్యంలో చిరంజీవి, రమ్యకృష్ణ, రంభ హీరో, హీరోయిన్లుగా అల్లుడామజాకా అనే సినిమా 1995 ఫిబ్రవరిలో విడుదల అయింది. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర అలనాటి నటి లక్ష్మీ గారు వేయడం జరిగింది. అయితే కోదండ రాంరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా అత్తకి యముడు అమ్మాయికి మొగుడు అనే చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇందులో అత్త పాత్రని అలనాటి నటి వాణిశ్రీ పోషించడం జరిగింది. ఆ సినిమాకి వాణిశ్రీ కి మంచి పేరు రావడం జరిగింది. సరిగ్గా ఆరు సంవత్సరాలకి అత్త ప్రధాన పాత్రలో చిరంజీవి అల్లుడా మజాకా సినిమా రూపొందిస్తున్న సమయంలో.. అత్త పాత్ర కోసం వాణిశ్రీని సంప్రదించడం జరిగింది. దర్శకుడు ఈ.వీ.వీ, పోసాని కృష్ణ మురళి రాసిన కథని వాణిశ్రీకి వినిపించడం జరిగింది.

అప్పుడు వాణిశ్రీ అల్లుడా మజాకా సినిమాలో అత్త తన కూతురు శోభనం జరిగే సమయంలో కొన్ని హద్దులు దాటే సీన్స్ ఉండడంతో వాణిశ్రీ ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక అల్లుడా మజాకా సినిమా విడుదలైన అనంతరం కమ్యూనిస్టులు, జాతీయ హిందూ వాదులు ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వాటిని సినిమా నుండి తీసివేయాలని కోరడం జరిగింది. ఆ క్రమంలో ఈ సినిమాని రెండు నెలల తర్వాత నిలిపివేసి, రీ సెన్సార్ కి పంపించడం జరిగింది. దానితో చిరంజీవి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నాలు చేయడం జరిగింది. అప్పుడు సెన్సార్ బోర్డు కొన్ని కట్స్ తో అల్లుడా మజాకా సినిమాకు అనుమతి ఇవ్వడం జరిగింది. అలా అల్లుడా మజాకా తిరిగి పున ప్రారంభమై ఘన విజయాన్ని సాధించింది. అయితే ఇందులో శోభనం గదిలోకి చిరంజీవి రావడంతో కరెంటు పోయి తిరిగి కాసేపటికి వస్తుంది.. అప్పుడే మామగారైన గిరిబాబు ఇద్దరు కూతుర్లు మరియు అత్త… ఈ ముగ్గురిలో ఎవరితో అని సైగ చేయడంతో… చిరంజీవి ఒక నెల గడిస్తే గాని తెలియదని చెప్తారు. అలాగే హీరోయిన్స్ రంభ, రమ్యకృష్ణ చెరువులో స్నానం చేసేటప్పుడు..చిరంజీవి మంచినీళ్ల చెరువులో ఈదోద్ధని వారిని అడ్డగీస్తాడు.. ఇలా ఈ రెండు దృశ్యాలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.

































