Virat Kohli: ఒకప్పుడు రన్నింగ్ మిషన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ 2022 ఐపీఎల్ లో మాత్రం తన ఆటతో అభిమానులను నిరాశ పరుస్తున్నాడు. 2022 ఐపీఎల్ లో జరిగిన 9 టోర్నీ లలో విరాట్ కోహ్లీ కేవలం 128 పరుగులు మాత్రమే చేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

ముందు లాగ విరాట్ ఈ మ్యాచ్ లో తన సత్తా చూపించలేకపోతున్నాడు. బ్యాటింగ్ విషయంలో కూడా కోహ్లీ తీరు చూసి అభిమానులు నిరాశా చెందుతున్నారు.2022 ఐపియల్ లో గ్రౌండ్ లో మోత మోగించే ఆటగాళ్ళు గ్రౌండ్ బయట మాత్రం చాలా ఫన్నీగా ఉంటున్నారు.

IPL 2022లో బయో బబుల్ మధ్య కూడా ప్లేయర్స్ అందరూ కలిసి చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు . ఈ క్రమంలో కోహ్లీకి సంబంధిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వివాహ వేడుక ఈ నెల 27 వ తేదీ బుధవారం జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కోహ్లీతో పాటు మిగిలిన ఆర్సీబి ప్లేయర్లందరూ సందడి చేశారు.
వీడియో వైరల్…
పెళ్లి వేడుకలో బ్లాక్ కలర్ పైజామా ధరించిన కోహ్లీ అందరికీ ఆకర్షణగా నిలిచాడు. వెడ్డింగ్ ఈవెంట్ లో కోహ్లీ, షాబాజ్ అహ్మద్, ప్లెసిస్ ముగ్గురు కలిసి డాన్స్ చేస్తూ హంగామా చేశారు. మాక్స్‌వెల్ వెడ్డింగ్ ఈవెంట్‌లో ఈ ముగ్గురు కలిసి పుష్ప సినిమాలో సమంత చేసిన ” ఊ అంటావా మామ ” అనే పాటకు ముగ్గురు డాన్సులు వేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Virat Kohli & Shabaz Dancing ????????
— Prajwal (@Prajwal2742) April 27, 2022
Virat Looking So Happy ♥️@imVkohli@RcbianOfficial @RCBTweets#ViratKohli #RCB #Shabazahmed #ViratKohli???? pic.twitter.com/UzX1UKV2Bd





























