Pregnant After 40 Years: ప్రస్తుత కాలంలో మహిళలు కూడా విద్యా ఉద్యోగం అంటూ పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వెంటనే పిల్లలని ప్లాన్ చేయడం లేదు అందుకే ప్రస్తుత కాలంలో మహిళలందరూ కూడా 30 తర్వాత దాదాపు 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పిల్లలను కనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలా మహిళలు 40 కి దగ్గర పడుతున్న సమయంలో పిల్లలను కనడం వారి ఆరోగ్యానికి మంచిదేనా పిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందా అనే విషయానికి వస్తే…

40 సంవత్సరాల వయసు దగ్గర పడుతున్న సమయంలో పిల్లల్ని కనడం పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను కనడానికి 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఎంతో మంచిదని ఈ సమయంలో పిల్లలను కనడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా జన్మిస్తారు. 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి మహిళలలో విడుదల అయ్యే అండాల నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది తద్వారా పిల్లలు పుట్టడం కూడా చాలా అరుదు ఒకవేళ పుట్టిన ఎన్నో రకాల సమస్యలతో జన్మిస్తూ ఉంటారు.
40 సంవత్సరాల వయసు దగ్గరకు పడే మహిళలలో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు పిల్లల్ని కనుక కణాలని భావిస్తే వారి జీవితాన్ని కూడా ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. 30 సంవత్సరాల లోపు మొదటి బిడ్డకు జన్మనివ్వడం ఎంతో మంచిది అయితే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఆరు ఏడు నెలల వ్యవధిలోని మరొకసారి గర్భం దాల్చడం చాలా ప్రమాదకరం.
18 నెలల గ్యాప్ అవసరం…
మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు 18 నుంచి 23 నెలల గ్యాప్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇలా ఉంటేనే రెండో బిడ్డకు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు. అలా కాకుండా ఐదు నెలల గ్యాప్ లోనే మరోసారి గర్భం దాల్చితే అది తల్లి బిడ్డల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఇలా గర్భం దాల్చడం వల్ల రక్తస్రావం జరగడం, తల్లి ఆరోగ్యం పై అధిక ప్రభావం చూపడం వంటివి జరుగుతుంటాయి.అందుకే పిల్లల విషయంలో సరైన ప్లానింగ్ ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.




























