Samantha: పుష్ప సినిమా రికార్డులను క్రియేట్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది. హిందీ, తమిళ్, మళయాళం, కన్నడ, తెలుగు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. విడుదలైన అన్ని భాషల్లో కూడా రికార్డ్ వసూళ్లను తెచ్చుకుంది. ముఖ్యంగా హిందీలో ఇప్పటికే దాదాపు 60 కోట్లు కొల్లగొట్టింది.

ఇదిలా ఉంటే ఇందులో సమంత చేసిన సాంగ్ చిత్ర విజయానికి కీలక అయింది. ‘‘ ఊ అంటావా మావా..ఊఊ అంటావా’’ సాంగ్ సమంత ఐటెం సాంగ్ ఓ రేంజ్ లో హిట్ అయింది. మూవీ విడుదలకు ముందే .. ఈ సాంగ్ రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత.. తొలిసారి సమంత తెరపై కనిపిస్తుండటంతో ఆడియన్స్ లో కూడా ఆసక్తి నెలకొంది. అది కూడా ఊర మాస్ ఐటెం సాంగ్ కావడంతో ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగాయి. దీంతో అభిమానులు విపరీతంగా సాంగ్ ను హిట్ చేశారు.
సాంగ్ రిహార్సల్స్ చేస్తున్న వీడియోలను..
అయితే ఈ సాంగ్ హిట్ కావడానికి ఏవిధంగా సమంత కష్టపడిందనే విషయాలను లేటెస్ట్ గా వెల్లడించింది. సాంగ్ రిహార్సల్స్ చేస్తున్న వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బి హైండ్ ది సీన్స్ అంటూ వీడియోను విడుదల చేసింది. ఇది చూశాక సమంత పడిన కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత వరసపెట్టి సినిమాలను చేస్తోంది. ‘శాకుంతలం’ అనే ప్యాన్ ఇండియా మూవీ చేస్తోంది. దీంతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో యశోద మూవీని కూడా చేస్తోంది. దీంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లు చర్చల్లో ఉన్నాయి.


































