పన్ను చెల్లించే వారికి అలర్ట్.. ఆ తప్పు చేస్తే భారీ జరిమానా..?

0
165

ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లకు పన్ను చెల్లింపుల రిటర్నులు దాఖలు చేయడానికి రేపే చివరి రోజనే సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం జులై 31వ తేదీ పన్ను చెల్లింపుల రిటర్న్ లు దాఖలు చేయడానికి చివరితేదీగా ఉండేది. ఈ ఏడాది కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల కేంద్రం ఆ గడువును పొడిగించింది. 2019 – 2020 సంవత్సరానికి ఐటీఆర్ ఇప్పటివరకు దాఖలు చేయకపోతే రేపు కంగారు పడే బదులుగా ఈరోజే దాఖలు చేస్తే మంచిది.

ఏదైనా కారణాల వల్ల రేపటిలోపు ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతే మాత్రం రెండు రెట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఆదాయపు పన్ను రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేస్తే అధికారులు 5,000 రూపాయలు జరిమానా వసూలు చేసేవారు. అయితే ఇకపై ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేస్తే 10,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇన్ కమ్ ట్యాక్స్ ఇండియా ట్విట్టర్ ద్వారా గడువులోగా ఐటీఆర్ దాఖలు గడువులోగా దాఖలు చేయాలని కోరింది.

గడువులోగా దాఖలు చేయడం సాధ్యం కాకపోతే లేట్ ఫీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్థిక సంవత్సరంలో నికర ఆదాయం ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉన్నవాళ్లు మాత్రమే ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఐటీఆర్ డెడ్ లైన్ ను గతంతో పోలిస్తే ఏకంగా ఐదు నెలలు పొడిగించడం వల్ల అధికారులు జరిమానా మొత్తాన్ని పెంచారని సమాచారం.

5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేస్తే 1000 రూపాయలు జరిమానాగా చెల్లించాలి. 2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 2021 సంవత్సరం మార్చి 31వ తేదీ మధ్యలో ఐటీఆర్ దాఖలు చేస్తే ఈ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. https://www.incometaxindiaefiling.gov.in/home వెబ్ సైట్ ద్వారా జరిమానాకు సంబంధించి పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here