ఇల్లును అమ్మేయాలనుకుంటున్న జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్.. రీజన్ తెలిస్తే కన్నీరు పెట్టుకోవాల్సిందే?

0
44
comedian Shanthi Swaroop : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా లేడీ గెటప్ తో అందరి దృష్టిలో పడ్డాడు శాంతి స్వరూప్. తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు. ఎక్కువగా లేడీ గెటప్స్ తోనే ఆయన బాగా క్లిక్ అవుతూ ఉంటాడు. అయితే చూడటానికి అందరినీ నవ్విస్తూ ఉండే ఈయన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురుకున్నాడని చెప్పాలి. కొన్ని సందర్భాలలో ఆయన పడిన కష్టాలు గురించి తనకోసం తన తల్లి పడిన కష్టాల గురించి కూడా చెప్పుకొచ్చాడు.

గతంలో తన తల్లి తమ కోసం చాలా ఇళ్లల్లో పని చేసింది అని.. తన తల్లికి గొంతు సరిగ్గా లేకపోవడంతో స్పష్టంగా మాట్లాడలేదని తెలిపాడు. నిజానికి శాంతి స్వరూప్ తన తల్లి పట్ల బాగా ప్రేమ చూపిస్తూ ఉంటాడు. తన తల్లి ఆరోగ్యం బాగు చేయటం కోసం ఆమెను హాస్పిటల్ లో కూడా బాగా చూపించాడు అని గతంలో తెలిసింది. కానీ ఇప్పటికి తన తల్లికి ఆరోగ్యం కుదుట పడలేదని తెలుస్తుంది.

అయితే తాజాగా తను ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో పంచుకున్నాడు. అదేంటంటే తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఆమెకు ఇప్పుడు శస్త్ర చికిత్స అవసరమని.. అందుకు సర్జరీ కోసం డబ్బులు లేకపోవడంతో తన ఇల్లును అమ్మేస్తున్నట్లు తెలిపాడు. అయితే శాంతి స్వరూప్ ఆ మధ్యనే ఇష్టంగా ఇల్లు కొనుక్కున్న సంగతి తెలిసిందే. కానీ తన తల్లి ఆపరేషన్ కోసం తను ఇష్టంగా తీసుకున్న ఇల్లును అమ్మడానికి నిర్ణయించుకున్నాడని తెలిసింది.

comedian Shanthi Swaroop :

అయితే మరో విషయం ఏంటంటే ఈ ఇల్లు అమ్ముతున్న విషయం తన తల్లికి తెలియదు అని.. ఆమె కంటే తనకు ఏది ముఖ్యం కాదు అని.. తను ఈ ఇల్లు అమ్మేస్తున్న విషయం తన తల్లికి తెలిస్తే అస్సలు ఒప్పుకోదని చెబుతూ కంటనీరు పెట్టుకున్నాడు శాంతి స్వరూప్. ఇక ఆ వీడియో చూసిన వాళ్లంతా శాంతి స్వరూప్ చేస్తున్న పనికి ఫిదా అయ్యారు. తల్లి ప్రేమ కోసం ఇష్టమైన ఇల్లును కూడా అమ్ముకుంటున్నావంటే నీది గొప్ప మనసు అంటూ పొగుడుతున్నారు. ఎలాగైనా మీ అమ్మగారు కోలుకుంటారు అంటూ ధైర్యం ఇస్తున్నారు.