Jabardasth Apparao: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అప్పారావు ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. ఈ కార్యక్రమంలో కమెడియన్ గా తన డైలాగ్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈయన ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ ఇతర బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉన్నారు.

ఇక ఈ మధ్యకాలంలో అప్పారావు వరుసగా పలు యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన సోషల్ మీడియా గురించి అలాగే యూట్యూబ్ ఛానల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఎన్నో యూట్యూబ్ ఛానల్ పుట్టుకురావడమే కాకుండా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ వెరైటీ థంబ్నెయిల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పారావు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానల్స్ వారు వారి ఛానల్ వ్యూస్ కోసం బ్రతికి ఉన్నటువంటి సెలబ్రిటీలను కూడా చంపేస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యారు.

Jabardasth Apparao: మానసిక క్షోభకు గురి చేస్తున్నారు…
పిచ్చిపిచ్చి థంబ్నెయిల్ పెడుతూ సెలబ్రిటీలు బ్రతికుండగానే వారిని చంపేస్తున్నారని ఇలా ఒక వ్యక్తి బ్రతికుండగానే చనిపోయారు అంటూ చెప్పే హక్కు మీకు లేదని ఈయన తెలిపారు. ఇలాంటి వార్తలు రాయటం వల్ల సెలబ్రిటీలు చాలా మానసికక్షోభకు గురవుతున్నారని, నిజా నిజాలు తెలియకుండా వార్తలు రాయడం సరైన పని కాదంటూ ఈ సందర్భంగా అప్పారావు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




























