Punch Prasad: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో పంచ్ ప్రసాద్ ఒకరు. ఈయన తన అద్భుతమైనటువంటి పంచ్ డైలాగ్స్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అయితే ఈయన అనారోగ్య సమస్యల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు చివరికి మరణం అంచుల వరకు వెళ్లి వచ్చారు. కానీ ఈయనకు క్లిష్ట పరిస్థితులలో ఏపీ ప్రభుత్వం అండగా నిలిచి తనకు పునర్జన్మను కల్పించారు.

ప్రస్తుతం ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నటువంటి పంచ్ ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇన్ని రోజులు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కెరియర్ కు దూరంగా ఉన్నాను అయితే నా ఆరోగ్యం కుదుటపడిందని తనకు ఇప్పుడే అవకాశాలు కల్పించిన తాను షోలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు..
ఇక ప్రసాద్ తన భార్య గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు. తన భార్య సునీతను తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపారు. నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసిన ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే ఆమె నన్ను ప్రేమించింది నా కామెడీ డైలాగ్స్ పంచ్ డైలాగ్ లు చూసే ప్రేమించిందని తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం నేను పంచ్ డైలాగులు కనుక వేస్తే ఛీ కొడుతుందంటూ ఈయన చెప్పుకోవచ్చారు.
ప్రేమ వివాహం..
ఒకప్పుడు ఆ డైలాగ్స్ చూసి నా ప్రేమలో పడిన నా భార్య ఇప్పుడు అదే డైలాగ్స్ కనుక చెబితే ఛీ కొడుతుందని సరదాగా కామెంట్ చేశారు అయితే నేను అనారోగ్య సమస్యలలో ఉన్నప్పుడు తన భార్య తనకు ఎంతో అండగా నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం నేను కోలుకున్నానని తన భార్య కాస్త అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని ఈయన ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































