Jabardasth Satya Sri: బుల్లితెర పై ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమంది కమెడియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.గత పది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పరిచయమై ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతోనూ ఇతర అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం మొదట్లో చమ్మక్ చంద్ర అదిరే అభి వేణు వంటి కమెడియన్స్ పెద్ద ఎత్తున సందడి చేసే వాళ్ళు.

ప్రస్తుతం ఈ కమెడియన్స్ అందరూ కూడా జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లారు.ఇకపోతే ఈ కార్యక్రమం మొదట్లో కేవలం మగవాళ్ళు మాత్రమే పెర్ఫార్మెన్స్ చేసేవారు. అయితే మగవారు లేడీ గెటప్స్ వేసి పెద్ద ఎత్తున సందడి చేసేవారు.ఈ కార్యక్రమంలో లేడీ కమెడియన్స్ కూడా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ విధంగా ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా పరిచయమైన లేడి కంటెస్టెంట్ లలో సత్య శ్రీ ఒకరు.

సత్య శ్రీ జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు పలు సినిమాలలోను బుల్లితెర సీరియల్స్ లోను నటించారు. అయితే సినిమాలలో సీరియల్స్ లో నటించిన ఈమెకు రాని గుర్తింపు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా వచ్చింది. ఈ కార్యక్రమంలో ఈమె చమక్ చంద్ర టీం లో సందడి చేసేవారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి సత్య శ్రీ దూరమైంది.అయితే ఈమె ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బయటపెట్టారు.
చమ్మక్ చంద్ర నాకు గురువుతో సమానం…
ఈ సందర్భంగా సత్య శ్రీ మాట్లాడుతూ తనని జబర్దస్త్ కార్యక్రమానికి పరిచయం చేసింది చమ్మక్ చంద్ర. తాను చంద్ర గారిని ఎప్పుడు ఒక గురువుగా భావిస్తాను. అయితే ఆయన జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడంతో మా టీం అందరూ కూడా మా గురువుగారు ఎక్కడుంటే మేము కూడా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాము. అందుకే తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలిపెట్టాల్సి వచ్చిందని సత్య శ్రీ ఇంటర్వ్యూ సందర్భంగా అసలు విషయం బయట పెట్టారు.
































