Jacqueline Fernandez: జాక్వెలిన్ పెర్నాండిస్ పరిచయం అవసరం లేని పేరు.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. సుఖేష్ చంద్రశేఖర్ 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్టు కావడంతో ఈ కేసుకు నటి జాక్వెలిన్, నోరా పతేహి పేర్లను కూడా ఈడి చార్జి షీట్ లో పొందుపరిచారు.

ఇక ఈ కేసులో భాగంగా తాజాగా కోర్టు విచారణకు హాజరైనటువంటి ఈమె సుఖేష్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈయన తనకు ఒక పెద్ద అభిమానిని అంటూ తనని పరిచయం చేసుకున్నారని, తాను సన్ టీవీ ఓనర్, దివంగత సీఎం జయలలితకు బంధువు అంటూ తనతో పరిచయం ఏర్పరచుకున్నారు. తనకు పెద్ద అభిమానిని మీతో సౌత్ లో సినిమా చేస్తానంటూ ఆయన నాకు పరిచయమయ్యారని జాక్వెలిన్ తెలిపారు.
ఇలా ప్రతిరోజు సుఖేష్ ఉదయం షూటింగ్ కు వెళ్లే ముందు అలాగే షూటింగ్లో ఉన్నప్పుడు కూడా తనకు ఫోన్ చేసేవారు ఇక షూటింగ్ నుంచి ఇంటికి రాగానే వీడియో కాల్స్ చేసేవారని ఈమె తెలియజేశారు. అయితే అతను జైలులో ఉండి కూడా నాకు ఫోన్ చేశారనే విషయం తెలియదు. ఇక ఆయన జైలులో ఉన్నారని తెలియగానే షాక్ అయ్యానని జాక్వెలిన్ తెలిపారు.

Jacqueline Fernandez:నా ఎమోషన్స్ తో ఆడుకున్నాడు…
సుఖేష్ గురించి పింకీకి పూర్తిగా తెలుసు కేవలం తన కెరియర్ నాశనం చేయాలన్న ఉద్దేశంతో తన నెంబర్ సుకేష్ కి ఇచ్చి తానే ఇదంతా చేయించిందని జాక్వెలిన్ తెలిపారు. సుఖేష్ నా అభిమానిగా నాకు పరిచయమై తను నా ఎమోషన్స్ తో ఆడుకున్నారని, నా కెరియర్ మొత్తం నాశనం చేశారంటూ ఈ సందర్భంగా ఈమె తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జాక్వెలిన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
































