ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఖాతాల్లో నగదు జమ..?

0
122

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాలలో నగదు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ రైతులకు సున్నావడ్డీ పంట రుణాలు ఇస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. రైతులకు 1200 కోట్ల రూపాయల బకాయిలు కూడా చెల్లిస్తున్నామని వెల్లడించారు.

సీఎం జగన్ చేతుల మీదుగా ఈ నెల 17వ తేదీన సున్నా వడ్డీ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. 2019 సంవత్సరానికి సంబంధించిన 510 కోట్ల రూపాయల సున్నా వడ్డీ రుణాలను సైతం చెల్లిస్తున్నామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే జగన్ సర్కార్ ఎన్నో నిర్ణయాలను తీసుకుని అమలు చేయగా తాజాగా మరో నిర్ణయం అమలుకు సిద్ధమైంది. ఏపీ ప్రభుత్వం నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.

గత నెలలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టం అందజేయడానికి సైతం ప్రభుత్వం సిద్ధమైంది. వేరుశెనగ, వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలు, ఉద్యానవన పంటలకు కూడా ఈ నెల 17వ తేదీనే ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీని జమ చేయనుంది. కన్నబాబు మాట్లాడుతూ టీడీపీ బకాయిలను కూడా వైసీపీ చెల్లిస్తోందని.. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదని.. రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ కేంద్రాలుగా మారుస్తున్నామని చెప్పారు.

సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారని కన్నబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సున్నా వడ్డీ రుణాలను ఎగ్గొట్టారని.. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న మనసున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here