Jai Chiranjeeva Movie: చిరంజీవి హీరోగా నటించిన సినిమాలలో జై చిరంజీవ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో భూమిక, సమీరా రెడ్డి హీరోయిన్లుగా చిరంజీవి సరసన నటించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి మేనకోడలిగా శ్రియ శర్మ అనే చిన్నారి నటించిన. ఈ సినిమాలో తన చలాకీ నటనతో ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రియ శర్మ ఇప్పుడు పెరిగి పెద్దది అయ్యింది.

చిన్నప్పుడు తన ముద్దు ముద్దు మాటలతో చిలిపి చేష్టలతో అందరినీ ఆకట్టుకున్న శ్రియ ఇప్పుడు హీరోయిన్ కి మించిన అందంతో ఉంది. శ్రియ శర్మ వయసు ఇప్పుడు 25 సంవత్సరాలు . శ్రియ శర్మ ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుందో ?అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జై చిరంజీవ సినిమా ద్వారా చెల్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రియ శర్మ ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ” చిల్లర్ పార్టీ ” అనే సినిమాలో తన నటనకు జాతీయ అవార్డు అందుకుంది.
ఆ తర్వాత దూకుడు, ఎటో వెళ్లిపోయింది మనసు, తూనీగ తూనీగ వంటి సినిమాలలో హీరోయిన్ చెల్లెలి క్యారెక్టర్ లో నటించింది. ఇక హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన “నిర్మలా కాన్వెంట్” సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ద్వారా శ్రియ శర్మ హీరోయిన్గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమా తర్వాత హీరోయిన్ గా శ్రీయాశర్మకు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇలా సినిమాలలో సరైన అవకాశాలు రాకపోవడంతో కొంతకాలం సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.

Jai Chiranjeeva Movie: లా చదివిన శ్రియ శర్మ…
ఇలా సినిమాలు సీరియల్స్ లో నటించడమే కాకుండా అనేక వాణిజ్య ప్రకటనలలో కూడా నటించింది. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న శ్రియా శర్మకి 2016 తర్వాత సరైన అవకాశాలు రాకపోవటంతో ఇండస్ట్రీకి దూరం అయ్యి చదువు మీద శ్రద్ధ పెట్టింది. శ్రియ శర్మ లా విద్యా అభ్యసించి ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రియ శర్మకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.