టెన్త్ ఫెయిల్.. కానీ అదృష్టం దరిద్రంలా పట్టింది?

0
636

పుట్టింది ఓ నిరుపేద కుటుంబంలో,ఆ కుటుంబం పడుతున్న కష్టాలు తన కొడుకు పడకూడదని భావించి ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తన కొడుకును చదివించాలని భావించారు. అయితే తమ కొడుకు టెన్త్ ఫెయిల్ కావడంతో కుటుంబ పోషణ భారమై తను ఒక ఆటో డ్రైవర్ గా మారాడు. ఆటో డ్రైవర్ గా మారినప్పటికీ ఏదో సాధించాలనే సంకల్పం,ఉంది. ఆ సంకల్పమే రంజిత్‌ సింగ్‌ను ఆటో డ్రైవర్ నుంచి బిజినెస్‌ మ్యాన్‌ గా, ఫేమస్‌ యూట్యూబర్‌ గా మార్చేసింది.

ప్రతిఏడు జైపూర్‌కు దేశ విదేశాలనుంచి టూరిస్ట్‌లు వస్తుండేవారు. టూరిస్ట్‌లను ఆకట్టుకునేందుకు స్థానిక ఆటో డ్రైవర్లు విదేశీ భాషలను నేర్చుకొని వారికి అక్కడ విషయాలను వివరించే వారు. ఈ ఐడియా రంజిత్‌ సింగ్‌ కి బాగా నచ్చింది.ఈ క్రమంలోనే ఒకసారి ఫ్రాన్స్‌ నుంచి ఓ యువతి జైపూర్‌ చూసేందుకు వచ్చింది. ఆ అమ్మాయి రంజిత్‌ సింగ్‌ ఆటో ఎక్కడం. జైపూర్‌ అంతా తన ఆటోలో తిప్పి చూపించడంతో వారిద్దరి మధ‍్య స్నేహం ప్రేమగా మారింది. ఆ యువతి తిరిగి జైపూర్‌ నుంచి ఫ్రాన్స్‌ వెళ్ళినా రంజిత్‌ సింగ్‌ తో వీడియో కాల్ మాటాడేది.

ఈ విధంగా ఫ్రాన్స్‌ యువతితో ప్రేమలో పడిన అతని ఆశయాన్ని మర్చిపోలేదు. ఎలాగైనా ఫ్రాన్స్‌కు వెళ్లాలి. అక్కడే స్థిరపడాలని భావించాడు. కానీ టెన్త్ ఫెయిల్ కావడంతో అతనికి వీసా లభించలేదు. ఈ క్రమంలోనే అతని గర్ల్ ఫ్రెండ్ ఇండియా తిరిగి వచ్చి ఎంబసీ అధికారుల్ని రిక‍్వెస్ట్‌ చేయడంతో రంజిత్‌కు ఫ్రాన్స్‌కు వెళ్లేందుకు మూడు నెలల విజిటింగ్‌ వీసా ఇచ్చారు. కోటి ఆశలతో విజిటింగ్‌ వీసాతో ఫ్రాన్స్‌ లోకి అడుగు పెట‍్టాడు.

ఈ విధంగా ఫ్రాన్స్ కి వెళ్ళిన రంజిత్ అక్కడ ఫ్రాన్స్ భాష నేర్చుకొని ఫ్రాన్స్ లో ఉన్న పర్యాటక ప్రాంతాలను వీడియో ద్వారా తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసే వారు.అదేవిధంగా ఓ రెస్టారెంట్లో ఉద్యోగం చేస్తూ 2014వ సంవత్సరంలో తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్నారు.ఈ విధంగా పదవ తరగతి ఫెయిల్ అయినప్పటికీ ఎంతో పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి త్వరలోనే స్విట్జర్లాండ్ లో ఓ రెస్టారెంట్ ఓనర్ కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ ఆటో డ్రైవర్ కథ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది తెలిసిన నెటిజన్లు ఇతని జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తే కచ్చితంగా భారీ విజయం అవుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.