Neha Shetty: సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ల పై రోజుకి ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హీరోయిన్ల గురించి తప్పుగా మాట్లాడటం..వారి గురించి లేనిపోని వార్తలు రావడం సర్వసాధారణం అయ్యింది.అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్ల గురించి ఈ విధమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో సదరు హీరోయిన్ స్పందిస్తూ ఘాటుగా సమాధానం చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఇలాంటి చేదు అనుభవం నటి నేహా శెట్టి కి కూడా ఎదురయ్యింది. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేయడంతో ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్ట్ సురేష్ కొండేటి హీరోయిన్ పుట్టుమచ్చల గురించి తప్పుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరోయిన్ చేతల 16 పుట్టుమచ్చలు అని చెప్పారు నిజంగా ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు.
ఇది ఎంతో దురదృష్టకరం…
ఈ విధంగా జర్నలిస్ట్ తన పుట్టు మచ్చల గురించి అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేహా శెట్టి ఈ వీడియోని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు ట్రైలర్ లాంచ్ లో ఈ ప్రశ్న ఎంతో దురదృష్టకరం. తన ఇంట్లో తన చుట్టుపక్కల ఉన్న స్త్రీల గురించి ఎంతటి గౌరవంగా ఉంటారనేది ఈ మాటలను బట్టి అర్థం అవుతుంది అంటూ ట్విట్టర్ ద్వారా ఈ వీడియోని షేర్ చేస్తూ సదరు జర్నలిస్టు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ కి నిర్మాత సూర్యదేవర నాగ వంశీ రిప్లై ఇస్తూ చాలా దురదృష్టకరం అంటూ కామెంట్ చేశారు.
This question was very unfortunate at the trailer launch today. But I must go on to add that it simply simplifies the respect he has for himself and for the women force around him at his work place and at home. https://t.co/XRDdIXaOZL
— Neha Sshetty (@iamnehashetty) February 2, 2022































