Jr.NTR: ఎన్టీఆర్ సెట్ లో ఆ పని చేయడం నేనెప్పుడూ చూడలేదు… ఆయన ఒక వండర్ కిడ్: శుభలేఖ సుధాకర్

0
72

Jr.NTR: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి బాలనటుడిగా అడుగుపెట్టిన ఎన్టీఆర్ అతి చిన్న వయసులోని హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇక ఈయన సినిమా షూటింగ్లో కూడా అందరితో ఎంతో సన్నిహితంగా ఉంటారని ఈయన అద్భుతమైన నటుడు మాత్రమే కాకుండా ఒక మంచి డాన్సర్ అని కూడా ఆయనతో కలిసి పని చేసినటువంటి ఎంతో మంది నటీనటులు ఇదివరకే తారక్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. తాజాగా నటుడు శుభలేఖ సుధాకర్ కూడా ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. ఇక శుభలేఖ సుధాకర్ ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేత సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… షూటింగ్ లొకేషన్లో ఎన్టీఆర్ నటనని చూసి తాను ఫిదా అయ్యానని తెలిపారు. షూటింగ్ లొకేషన్లో ఈయన అందరితో ఎంతో సరదాగా ఉంటారు.

Jr.NTR: ఆయన కెమెరా కోసమే పుట్టారు…

ఈయన కనుక లొకేషన్ లో ఉంటే సందడి వాతావరణం ఉంటుందని తెలిపారు. ఇక ఎన్టీఆర్ ఎప్పుడు డైలాగులు చదువుకుంటారో ఏమో తెలియదు కానీ లొకేషన్ లో మాత్రం ఆయన డైలాగులు చదువుతున్నది తాను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. అప్పటివరకు సరదాగా ఉండే ఎన్టీఆర్ టేక్ అనగానే మూడు నాలుగు పేపర్ల డైలాగులు కూడా సింగిల్ టేక్ లో చెబుతారు. ఆయన కెమెరా కోసమే పుట్టారు అనిపిస్తుంది. ఆయన ఒక వండర్ కిడ్ అంటూ ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్ ఎన్టీఆర్ నటన గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.