Jr.Ntr: ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నారు.అదేవిధంగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి ఈయన వార్ సినిమా సీక్వెల్ చిత్రంలో నటించబోతున్నారని కూడా తెలుస్తుంది.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పనులు పూర్తి చేయడంలో బిజీగా మారిపోయారు.ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా 75% షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.ఇకపోతే ఈమె ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసిన నటిస్తున్నటువంటి వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

Jr.Ntr: ఎన్టీఆర్ కు జోడిగా కియారా…
ఈ విధంగా కియారా అద్వానీ ఈ సినిమాలో నటించబోతున్నారని తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం ఎక్కడ ఏ విధమైనటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఇక వార్ 2 సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిప్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.




























