టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అర్ఆర్ఆర్” చిత్రంలో కొమురంభీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ గతంలో ఎంతో విలాసవంతమైన, ప్రత్యేక ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి కారును బుక్ చేశారని అది త్వరలోనే హైదరాబాద్ చేరుతుందనే వార్తలు పెద్దఎత్తున వినిపించాయి.

తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బుక్ చేసినటువంటి
ఇటాలియన్ లగ్జరీ లాంబొర్కిని కారు హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. తారక్ ఎంతో ఇష్టంగా బుక్ చేసుకున్నటువంటి లగ్జరీ కారును ఏకంగా ఐదు కోట్లు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన కొత్త కారును వేసుకుని తన స్నేహితుడు రామ్ చరణ్ ను కలవడం కోసం వెళ్లారని,ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన కొత్త కారును రామ్ చరణ్ ఇంటి ముందు పార్క్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త కార కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇకపోతే ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి “అర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వీరిద్దరి మద్య స్నేహం పెరగడంతో ఎన్టీఆర్ తన కొత్త కారులో చెర్రీని కలవడం కోసం వెళ్లారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ “అర్ఆర్ఆర్” తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.



























