Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొనడంతో ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా అప్డేట్ ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేశారు.

ఇలా ఎన్టీఆర్ కొరటాల సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా అప్డేట్ గురించి అభిమానులతో పాటు సుమ కూడా డైరెక్ట్ గా ఎన్టీఆర్ ను ప్రశ్నించారు దీంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా సుమపై సీరియస్ అయ్యారు. ఆమె వంక చాలా సీరియస్ గా చూడటమే కాకుండా అనంతరం తన కోపాన్ని అనుచుకొని మైక్ చేతపట్టి వాళ్లు అడగకపోయినా నువ్వే చెప్పించేసేలా ఉన్నావు అంటూ సీరియస్ అయ్యారు.
ఇక అభిమానులు కూడా తరచూ అప్డేట్ కావాలి అని అడగడంతో అభిమానులకి కూడా ఎన్టీఆర్ కాస్త వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ 30 అప్డేట్ మాత్రమే కాకుండా…ఏ హీరో సినిమా అయినా అప్డేట్ ఉంటే వెంటనే అభిమానులకు తెలియజేస్తారని అలా కాకుండా అప్డేట్ అప్డేట్ అంటూ తరచు అడగడంతో దర్శక నిర్మాతలు ఒత్తిడికి గురవుతారు అంటూ ఈయన అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు.

Jr Ntr: కావాలని ఏది దాచిపెట్టం…
మేము సినిమాలకు సంబంధించిన అప్డేట్లను కావాలని దాచిపెట్టం ఏదైనా ఉంటే ముందుగా మా కుటుంబ సభ్యులు మా భార్యల కన్నా ముందుగానే మీతో పంచుకుంటామని మాకు మీరే ముఖ్యం అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలిపారు.ఇలా అప్డేట్ అని తరచూ అడుగుతూ మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టకండి అంటూ కొంత పార్టీ అసహనానికి గురయ్యారు. ఇలా ఈ సినిమా వేడుకలో ఎన్టీఆర్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
































