జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్”ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు మనకు తెలిసిందే. దాదాపు చివరి దశలో షూటింగ్ ఉన్న ఈ సినిమా పై కరోనా ప్రభావం పడటం వల్ల షూటింగ్ వాయిదా పడింది. అయితే ఎన్టీఆర్ రాజమౌళి సినిమా తర్వాత తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుందనే సమాచారం తెలిసిందే.

ఇప్పటికే కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. తిరిగి ఇద్దరి కాంబినేషన్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్”, శివ “ఆచార్య”సినిమాలు2 పూర్తికాగానే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ ఏర్పడగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కథానాయికగా ఎవరు అనే సస్పెన్షన్ కి తెరపడినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వానీ, లేదా రష్మికను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో కియారా మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఈ తరుణంలోనే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని మరోసారి కియారాకే ఇవ్వాలనే ఆలోచనలో దర్శకుడు కొరటాల శివ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్రలో సందడి చేయనున్నారని, స్టూడెంట్ పాలిటిక్స్ తరహాలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా దర్శకుడు కియారాకి అవకాశం ఇస్తారా లేక రష్మికి అవకాశం ఇస్తారనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.































