సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని వారం రోజులు అవుతున్నా ఇప్పటికీ ఏదో విధంగా సమంత నాగచైతన్య విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఆ సమంత గురించి వివిధ ఆరోపణలు చేస్తున్న వారిపై పలువురు సినీ తారలు స్పందించి అది వారి వ్యక్తిగత విషయం అంటూ తనదైన శైలిలో నెటిజన్లకు కౌంటర్ ఇస్తూ సమంతకు మద్దతుగా నిలబడుతున్నారు.

ఇదిలా ఉండగా సమంత పోలికలతో ఉంటూ జూనియర్ సమంతగా పేరు సంపాదించుకున్న అషూరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ యాంకర్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, బుల్లితెర తారగా ఎన్నో కార్యక్రమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె అచ్చం సమంత పోలికలతో ఉండడంతో అందరూ ఈమెను జూనియర్ సమంతగా పిలుస్తుంటారు.
ఇక కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె నిత్యం సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇదిలా ఉండగా తాజాగా అషూరెడ్డి ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటోను షేర్ చేస్తూ.. స్టాప్ అండే స్టేర్.. బికాస్ అయామ్ రేర్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఫోటోపై ఒక అభిమాని స్పందిస్తూ..అశు మీరు అచ్చం సమంత పోలికలతో ఉంటారు..అయితే పెళ్ళి విషయంలో మాత్రం సమంత మాదిరి చేయకండి నేను మీ అభిమానిగా చెబుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

ఈ విషయంపై స్పందించిన ఆశు రెడ్డి సదరు అభిమానికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మీకు కథలో మరొక కోణం తెలియదు అనవసరంగా ఇతరుల జీవితాల గురించి మాట్లాడకండి అంటూ అభిమానికి తనదైన శైలిలో కౌంటర్ వేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా చాలామంది జూనియర్ సమంత పై ప్రశంసలు కురిపిస్తున్నారు.కేవలం ఆమె పోలికలతో ఉండటమే కాకుండా ఆమెకు ఎంతో మద్దతుగా నిలబడుతున్నారు అంటూ సమంత అభిమానులు కూడా ఈమె ప్రశంసలు కురిపిస్తున్నారు.