Kalyan Dev: మెగాస్టార్ చిన్నల్లుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం తన భార్య శ్రీజకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. శ్రీజను రెండవ వివాహం చేసుకున్న కళ్యాణ్ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారని తెలుస్తోంది.

ఇలా వీరిద్దరూ గత కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్న ఇప్పటివరకు వీరి విడాకుల గురించి లేదా వీరి గురించి వచ్చే వార్తల గురించి ఏ విధంగానూ స్పందించకపోవడంతో వీరి గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఇప్పటికే వీరిద్దరికి అధికారికంగా విడాకులు కూడా వచ్చాయని అయితే ఆ విషయాన్ని మెగా కుటుంబం తెలియచేయడం లేదని తెలుస్తుంది.
ఇక భార్యకు దూరంగా ఉన్నటువంటి కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు .అయితే ఈయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేస్తూ కొంతమందిని చూస్తే జాలిగా ఉంటుంది.

Kalyan Dev: శ్రీజతో సమస్యలు ఉన్నాయా..
ఎందుకంటే వారికి తెలిసింది గోరంత మాత్రమే తెలియాల్సింది కొండంత ఉంది అంటూ అర్థం వచ్చే ఒక పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో ఎంతోమంది శ్రీజ కళ్యాణ్ దేవ్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని విషయం గురించి మనకు చాలా తక్కువ తెలుసని కానీ వీరి మధ్య చాలా పెద్ద సమస్యలు ఉన్నాయని పరోక్షంగా కళ్యాణ్ దేవ్ ఇలా తెలియజేస్తున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.































