కమల్‌హాసన్ నటన సినీ పరిశ్రమలో మరెవరు చేయలేరు. అంతటి వైవిద్యమైన, విలక్షణంగా నటిస్తారు. అతడు కొన్ని సినిమాల్లో అయితే విభిన్న పాత్రల్లో నటించి.. వివిధ రకాలుగా హావభావాలను పండిస్తాడు. అంతటి విలక్షణ నటుడు నిజంగా భారతీయ చిత్ర పరిశ్రమలోనేలేరని అనిపిస్తుంటుంది. 1960 లో తమిళ భాషా చిత్రం కలత్తూర్ కన్నమ్మలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. దీని కోసం అతను రాష్ట్రపతి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు .

ప్రధాన నటుడిగా కె.బాలచందర్ దర్శకత్వం వహించిన 1975 నాటి అపూర్వ రాగంగళ్‌లో వచ్చింది. తర్వాత అతడి కెరీర్ నేటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోయింది. అతడు 220 కి పైగా చిత్రాలలో నటించారు. 2019 లో భారతదేశంలో సినిమా రంగంలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అతికొద్ది నటులలో ఒకడిగా నిలిచాడు. 21 ఫిబ్రవరి 2018 న తన రాజకీయ పార్టీ మక్కల్ నీది మయంను లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక అతడు నటించిన సినిమాల్లో చూడాల్సిన సినిమాలు ఏంటంటే.. 1996లో విడుదల అయిన భారతీయుడు.

అవినీతి, లంచగొండితనం నేపథ్యంలో శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రలు పోషించారు కమల్. ఈ చిత్రంలో కమల్ నటన అద్వితీయం. అతడి వందో సినిమా అయిన ‘రాజా పార్వై’లో గుడ్డి వాడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1981లో ఇది తెలుగులో అమావాస్య చంద్రుడుగా విడుదల అయింది. 1989లో విడుదలైన విచిత్ర సోదరులు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

ఇందులో కమల్ త్రిపాత్రాభినయం చేస్తారు. 1986లో వచ్చిన స్వాతి ముత్యం సినిమా అతడి కెరీర్ లోనే మైలురాయిగా పేర్కొనవచ్చు. మరో చరిత్ర సినిమా కూడా అతడికి మంచి పేరును తీసుకొచ్చింది. ‘ఆకలి రాజ్యం’ (1981) అయితే ఇప్పటికీ చాలామంది చూస్తుంటారు. ఇంకా అతడి సినమాల్లో ఎన్నో చూడదగ్గరవి ఉన్నాయి. అందులో మైఖేల్ మదన కామ రాజన్, హే రామ్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి.































