Kangana Ranaut: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటి గ్లామర్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా కంటే వ్యక్తిగత విషయం లోనే బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ముక్కుసూటి నటిగా నిలిచి ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకుంది.

2004లో ఐ లవ్ యు బాస్ అనే సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కంగనా రనౌత్. ఇక ఈ సినిమాలో తన తొలి నటనతోనే మంచి సక్సెస్ అందుకుంది. అలా ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకెళ్లింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమాలో కూడా నటించింది. ఇక కంగనా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
నిత్యం ఏదో ఒక విషయం తో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది. తన నోటికి వచ్చిన మాటలతో అందరిని వణికిస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. తాజాగా అమీర్ ఖాన్ పై ఫైర్ అయ్యింది. ఇంతకు ఆయనపై ఫైర్ అవ్వటానికి కారణం ఏంటంటే.. తాజాగా అమీర్ ఖాన్.. ప్రముఖ రచయిత్రి శోభా డే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే శోభ అమీర్ ఖాన్ ను తన బయోపిక్ ను తీసే తన పాత్రకు ఏ హీరోయిన్ సరిపోతుంది అని ప్రశ్నించింది. దాంతో ఆయన వెంటనే ఆలియా భట్, ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే పేర్లను తెలిపాడు.

Kangana Ranaut:
ఇక వెంటనే శోభ మీరు కంగనా పేరును మరిచిపోయారు అనటంతో.. ఇక అమీర్ అవును కంగనా బాగా నటిస్తుంది. స్ట్రాంగ్ యాక్టర్ అని కామెంట్ చేశాడు. అయితే దానికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేయడంతో.. ఆ వీడియోకు కంగనా స్పందించింది. పాపం అమీర్ ఖాన్ నా పేరును చెప్పకుండా ఉండటానికి చాలా కష్టపడ్డాడు అని వెటకారంగా తెలిపింది. నాలుగు జాతీయ అవార్డులు గెలుచుకున్న నన్ను అమీర్ ఖాన్ మర్చిపోయారు అంటూ కామెంట్ చేసింది.
Bechara Aamir Khan … ha ha he tried his best to pretend like he doesn’t know that I am the only three times national award winning actress none of those he mentioned has even one …
Thank you @DeShobhaa ji I would love to play you ♥️ https://t.co/o0tS6UYLoC— Kangana Ranaut (@KanganaTeam) February 10, 2023































