Kantharao Daughter Sushila : తెలంగాణ మొదటి సూపర్ స్టార్ అంటే కత్తుల కాంతారావు గారే. ఎన్టీఆర్ తో పాటు ఆ కాలంలో పౌరాణిక సినిమాల్లో నటుడుగా రాణించిన ఆయన అటు పౌరాణిక జానపదాలతో పాటు సాంఘిక చిత్రలలో కూడా అలరించారు. ఇక ఎన్నో సినిమాల్లో హీరోగాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేసిన ఆయన విలన్ గా కూడా ప్రయత్నించారు. ఇక ఆయన నటనకు ఎంతోమంది మంది అభిమానులు ఉన్న ఆయన ఆస్తిత్వాన్ని నిలుపుకోవాలని వాళ్ళ పిల్లలు ఆరాట పడుతున్నారు. ఇక అంత పెద్ద హీరో అయిన సినిమాలో సంపాదించినదంతా అందులోనే పోగొట్టుకున్న ఆయన చివర్లో సొంతిల్లు కూడా లేకుండా మరణించారు. ఇక ఆయన జీవిత విశేషలను ఆయన కూతురు సుశీల తాజాగా ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

కృష్ణ గారి సినిమా వల్ల నష్టపోయారు…..
కాంతారావు గారికి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు అంటూ ఆయన కూతురు సుశీల తెలిపారు. సినిమాల్లో నటిస్తూ అగ్ర హీరోగా ఎదిగిన ఆయన చెన్నైలో ఆస్తులను బాగానే సంపాదించిన ఆ తరువాత సినిమాలను సొంతంగా నిర్మించాలని భావించి తీశారు. వాటిలో కొన్ని సినిమాల వల్ల నష్టపోయి ఆస్తులను కోల్పోవ్వాల్సి వచ్చింది అంటూ సుశీల వివరించారు. కాంతారావు గారు నిర్మించిన మొదటి సినిమా సప్తస్వరాలు ఆ సినిమా ప్లాప్ అవడంతో ఆయన నష్టపోయారు. అయితే బాగా నష్టపోయింది మాత్రం కాంతారావు గారు, రాజశ్రీ, కృష్ణ గారు నటించిన సాంఘిక చిత్రం ప్రేమజీవులు సినిమా వల్ల. ఆ సినిమా డిజాస్టర్ గా మిగలడం వల్ల ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత బయట వాళ్ళు ఫైనాన్స్ చేస్తే గుండెలు తీసిన మొనగాడు సినిమా తీయగా ఆది పర్వాలేదనిపించిన పెద్ద హిట్ అయితే కాలేదు.

ఇక చాలా గ్యాప్ తరువాత తీసిన సినిమా స్వాతి చినుకులు వాణిశ్రీ సెకండ్ ఇన్నింగ్స్ సినిమా అయిన ఆ సినిమా ప్లాప్ అవడం తో ఇల్లు కూడా లేకుండా కాంతారావు గారి ఆస్తులు కరిగిపోయాయి అంటూ ఆయన కూతురు తెలిపారు. ఇక కృష్ణ గారు నాకు అభిమాన నటుడు అంటూ తెలుపుతూ సుశీల గారి పెళ్ళికి కృష్ణ గారు పదివేల రూపాయలు సహాయం చేశారట. కాంతారావు గారి పరిస్థితి చూసి విజయనిర్మల గారు వారు నిర్మించే ప్రతి సినిమాలోనూ ఒక పాత్ర ఆయనకు ఇస్తామంటూ మాటిచ్చారట. ఇచ్చినట్లుగానే వారి బ్యానర్ లో వచ్చిన సినిమాల్లో కాంతారావు గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.































