Kantharao daughter sushila : తెలంగాణ మొదటి సూపర్ స్టార్ అంటే కత్తుల కాంతారావు గారే. ఎన్టీఆర్ తో పాటు ఆ కాలంలో పౌరాణిక సినిమాల్లో నటుడుగా రాణించిన ఆయన అటు పౌరాణిక జానపదాలతో పాటు సాంఘిక చిత్రలలో కూడా అలరించారు. ఇక ఎన్నో సినిమాల్లో హీరోగాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేసిన ఆయన విలన్ గా కూడా ప్రయత్నించారు. ఇక ఆయన నటనకు ఎంతోమంది మంది అభిమానులు ఉన్న ఆయన ఆస్తిత్వాన్ని నిలుపుకోవాలని వాళ్ళ పిల్లలు ఆరాట పడుతున్నారు. ఇక అంత పెద్ద హీరో అయిన సినిమాలో సంపాదించినదంతా అందులోనే పోగొట్టుకున్న ఆయన చివర్లో సొంతిల్లు లేకుండా మరణించారు. ఇక ఆయన జీవిత విశేషలను ఆయన కూతురు సుశీల తాజాగా ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

450 ఎకరాలను పోగొట్టుకున్నారు…..
ఎన్టీఆర్ తో సమానంగా పౌరాణిక జానపదాలలో నటించిన అయన అప్పటి సమకాలిన నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక చెన్నై లో స్థిరపడి ఆస్తులను కూడా సంపాదించిన కాంతారావు గారు చివరి రోజుల్లో మాత్రం సొంత ఇల్లు కూడా లేకుండా చనిపోయారు. ఇక ఆయన ఆర్ధికంగా నష్టపోవటానికి ప్రధాన కారణం సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టి సినిమాలను తీసి అవి నష్టాలను తేవడం వల్ల ఆస్తులన్నీ కరిగిపోయాయి.

ప్రొడ్యూసర్ గా ఆయనే సినిమా తీయాలనీ అనుకుంటున్నా సమయంలో చాలా మంది వారించినా నష్టాలోస్తే కష్టం వద్దు అని చెప్పినా వినకుండా సినిమాలను నిర్మించి నష్టపోయారు. ఇక కాంతారావు గారి సొంతూరు కోదాడ వద్ద గుడిబండ. ఆ గ్రామంలో వారి కుటుంబం దొర కుటుంబం లాంటిది. నాలుగువందల ఎకరాల భూమి ఆయనకు ఉండేది. అయితే గుడి, బడి, స్మశానం ఇలా అన్నింటికి ఇచ్చి కొంత మిగుల్చుకున్న చివరికి సినిమాలను తీయడానికి మొత్తం భూమి అమ్మేశారట. పెద్ద ఇల్లును కూడా ఎలాగూ తన పిల్లలు ఎవరు అక్కడ స్థిరపడరు కదా అని ఆ ఇల్లు కూడా అమ్మేశారట. అలా సొంత్తూర్లో ఒక్క చిల్లిగవ్వ లేకుండా చేసుకున్నారట. ఇక చెన్నై లో కూడబెట్టిన ఆస్తులను కూడా సినిమా తీయడానికి వాడి కరిగించేశారట కాంతారావు గారు.
































