Kapil Dev: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.భారత క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే అర్జున్ టెండూల్కర్ క్రికెట్ కోసం ఎంతోమంది అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆయన ఐపీఎల్ లో అయిన బ్యాట్ చేతపట్టి ఆడితే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.

ఈ క్రమంలోనే 2021 ఐపీఎల్ మినీ వేలంలో అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో అర్జున్ టెండూల్కర్ కేవలం బెంజ్ కే పరిమితమయ్యారు పోనీ ఈ ఏడాది ఐపిఎల్ లో అయినా అర్జున్ టెండూల్కర్ బ్యాట్ చేత పడతానని ఎంతోమంది అభిమానులు ఆశ పడిన ఈ ఏడాది కూడా అభిమానుల ఆశ నెరవేరే లేదనే చెప్పాలి.

ఈ క్రమంలోనే అర్జున్ టెండూల్కర్ క్రికెట్ ఎంట్రీ గురించి భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్ చేశారు. అర్జున్ ఎంట్రీ గురించి కపిల్ దేవ్ మాట్లాడుతూ అర్జున్ ఇంకా చిన్న కుర్రాడే… ఒకవేళ అతను క్రికెట్ లో రాణించాలి అనుకుంటే తన తండ్రి ఆడిన ఆటలో కనీసం 50 శాతం ఆటతీరును కనబర్చిన సరిపోతుంది. పదేపదే అర్జున్ గురించి, అతనికి ఎంట్రీ గురించి మాట్లాడుతున్నారు.
నీ ఆట నువ్వు ఆడు…
ఆయన సచిన్ టెండూల్కర్ కొడుకు అయినప్పటికీ తనకి కాస్త స్వేచ్ఛ కావాలి. తన ఆటను తనని ఆడుకో నివ్వండి. అర్జున్ పేరు చివర టెండూల్కర్ అని ఉండటంతో అతనికి ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా కపిల్ దేవ్ తెలియజేశారు. ఆయన పేరు చివర టెండూల్కర్ అని ఉండటంతో అతను కూడా టెండూల్కర్ మాదిరి ఆట ఆడాలని అతనిపై ఒత్తిడి చేయకూడదు. అర్జున్ ఇంకా చిన్న కుర్రాడు. అర్జున్ కి చెప్పేది ఒకటే నీ ఆట నువ్వు ఆడు ఎవరి దగ్గర ప్రూఫ్ చేసుకోవాల్సిన పని లేదు. మీ నాన్న ఆడే ఆట తీరులో 50% ఆడిన చాలు అంటూ ఈ సందర్భంగా అర్జున్ టెండూల్కర్ గురించి కపిల్ దేవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Why is everyone talking about him? Because he is Sachin’s son. Let him play his own cricket, To have a Tendulkar name has perks and disadvantages as well. Bradman’s son changed his name because he could not soak the pressure.
— Fantasy Sports King (@FantasySportsK1) June 4, 2022
– Kapil Dev On Arjun Tendulkar #SachinTendulkar pic.twitter.com/WOkjFrh54P



























