Karate Kalyani: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా తరచూ తిరుమలకి వస్తూ ఉంటారు. తాజాగా సినిమా నటి కరాటే కళ్యాణి కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం నిమిత్తం తిరుమల చేరుకుంది. అయితే అక్కడ భక్తులకు గోవింద నామ స్మరణ చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని కరాటే కళ్యాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

కరాటే కళ్యాణి ఇటీవల తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తిరుమలలో తనకి ఎదురైన సమస్యల గురించి మీడియా ముందు లేవనెత్తింది. తిరుమల కొండపై స్వామివారి దర్శనానికి వెళితే గోవిందా.. గోవిందా అని దేవుని నామస్మరణ చేస్తుంటే.. అడ్డుపడుతున్నారని వెల్లడించింది. దేవుణ్ని మొర పెట్టుకునేందుకు వస్తే.. గోవిందా అనకుండా మా గొంతు నొక్కుతున్నారని వెల్లడించింది.
తిరుమలలో టీటీడీ ఉద్యోగులు పెత్తనం చేస్తున్నారని, పవిత్రమైన తిరుమల దేవస్థానంలో పనిచేస్తూ సాంప్రదాయమైన దుస్తులు ధరించడం లేదని సాంప్రదాయాలు పాటించడం లేదని తెలిపింది. ఇలా హిందూ సంప్రదాయాలను గౌరవించకుండా.. వెంకటేశ్వరుని అవమానిస్తే ఊరుకునేది లేదని అన్నారు. తిరుమల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నామని, సేవ్ తిరుమల హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తామని తెలియచేసింది.
అలాగే ఆహారం విషయంలో కూడా రేట్లు ఇష్టాను సారంగా నడుస్తున్నాయని, ఓ కుటుంబం తిరుమలకు వస్తే వాటర్ బాటిళ్లకే బోలెడంత ఖర్చు పెడుతున్నారని అన్నారు.

Karate Kalyani: స్వామి వారిని అవమానిస్తే ఊరుకునేది లేదు…
టాక్సీ రేట్లు కూడా అధికంగా ఉన్నాయని, ఈ పరిణామాలు చూస్తుంటే భక్తులను దూరం చేయటానికి ఇలా చేస్తున్నారని తెలిపింది. అలాగే ఈ సందర్భంగా డ్రోన్ విషయంపై కూడా ఆమె స్పందిస్తూ.. తొలుత అదేమీ లేదన్న టిటిడి, ఆ తర్వాత ఎవరి పేరో చెప్పి ఫైన్ వేసి చేతులు దులుపుకున్నారని తెలిపింది. వకుళ మాత ఆలయంలో చోరీ జరిగిందని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డికి విన్నవించినట్టు తెలిపింది. ఈ సమస్యల గురించి ఉద్యమం చేపట్టకముందే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


























