Karate Kalyani: నటి కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య జరుగుతున్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. వీరి మధ్య వివాదం రోజురోజుకు పెరుగుతుంది. శ్రీకాంత్ రెడ్డి మహిళల పట్ల అసభ్యకరంగా ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేశారు. ఈ విధంగా వీరిద్దరి మధ్య మొదలైన ఈ ఘర్షణ ఎన్నో వివాదాలకు కారణమవుతోంది.

ఇకపోతే కరాటే కళ్యాణి తాజాగా ఒక డెబిట్ లో పాల్గొని లైవ్ లోనే అతనిపై తిట్ల పురాణం మొదలుపెట్టింది. నేను వాన్ని అసలు వదలను, వెళ్లి వాన్ని తంతా, రేయ్ నీకు దమ్ముంటే నువ్వు ఏమన్నావో నీ మాటపై నిలబడు నా కాలి వెంట్రుక కూడా పీకలేవు. ఈ కేసులో గెలవడం కోసం చావడానికైనా సిద్ధమే. బాబి అనేది ఒక సినిమా క్యారెక్టర్ మా సినిమాకు నీ ఫ్రాంక్ వీడియోలకు పోలిక ఏంటి అంటూ పెద్దఎత్తున కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా రోడ్డుపై వెళ్లే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ చేసే వీడియోల వల్ల సమాజానికి ఏం తెలియచేయాలి అనుకుంటున్నావు అని భారీ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధంగా టీవీ లైవ్ లో పాల్గొన్న ఈమె శ్రీకాంత్ రెడ్డి పై బూతులు మాట్లాడింది.
సినిమాని అంటే ఒప్పుకోను..
ఇక శ్రీకాంత్ రెడ్డి కూడా ఒక వీడియో ద్వారా ఈమె నటించిన సినిమాల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం గురించి కరాటే కళ్యాణి మాట్లాడుతూ సినిమా పరిశ్రమను అంటే ఒప్పుకునేది లేదు. సినిమా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంటూ శ్రీకాంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి మధ్య జరిగిన ఈ గొడవ రోజురోజుకు పెరిగి పెద్దది అవుతుంది మరి ఈ వివాదం ఎక్కడ వరకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.
































