ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రెండు వేవ్ లతో తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలు మరో కొత్త రకం కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరోనా వేరియంట్ ను బీ.1.1.529 గా నామకరణం చేశారు.

కరోనా భయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో కొత్త వేరియంట్ పుట్టుకురావడంతో ప్రతీ ఒక్కరు కలవరపడుతున్నారు. ఇప్పటివరకు ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఇది చాలా శక్తివంతమైనది కావడం ఇప్పుడు ప్రపంచ దేశాలకు దడపుట్టిస్తోంది.
రోగ నిరోధక శక్తిని కూడా తట్టుకుని తొందరగా వ్యాప్తి చెందగలదని.. ఇప్పటివరకు మనం చూసిన వేరియంట్లలో ఇదే అత్యంత ప్రమాదకరమైనదని తెలిసి ఆందోళన చెందుతున్నారు. తాజాగా యూరప్ దేశాల్లో కేసుల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. మన దగ్గర కూడా కరోనా కేసుల్లో పెరుగదల కనిపిస్తోంది. మరో ఆందోళనకర విషయం ఏంటంటే.. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న మెడికల్ సిబ్బంది కరోనా బారిన పడ్డారనే వార్తలు చూశాం. కర్ణాటకలో దాదాపు 281 మంది మెడికల్ సిబ్బంది, కాలేజీ స్టూడెంట్లకు కరోనా సోకింది.
ఇక అక్కడి ప్రభుత్వం ఆ ప్రదేశాన్ని కోవిడ్ క్లస్టర్ గా మార్చేశారు. ఇదే వేవ్ ఇలానే కొనసాగతే కరోనా థర్డ్ వేవ్ తప్పదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇదే కనుకు కొనసాగతే.. మరో లాక్ డౌన్ అనేది తప్పదు. ఈ సారి కరోనా వ్యాప్తి రెండు వేవ్ ల కంటే భయంకరంగా ఉంటుందని.. ఎన్ని లాక్ డౌన్లు విధించినా వ్యాప్తి ఆపడం కష్టం అని వైద్యులు హెచ్చిరిస్తున్నారు. వచ్చిన తర్వాత జాగ్రత్త పడటంల కంటే.. అది రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం మంచిదని అంటున్నారు. మాస్క్ లు ధరించడంతో పాటు.. శానిటైజర్లను ఎప్పటికప్పుడు వాడాలని సూచించారు.






























