కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ నేడు ఉదయం జిమ్ చేస్తుండగా ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది.దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతనిని బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని భావించిన కుటుంబ సభ్యులు అభిమానులకు చేదు వార్తను తెలియజేశారు.

విక్రమ్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ నటుడు పునీత్ మరణించారని వైద్యులు అధికారికంగా వెల్లడించారు. పునీత్ మరణవార్త విన్న ఇండస్ట్రీ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కన్నడ సినిమా ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని ఈ క్రమంలోనే పునీత్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా ఏర్పడిందని పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.
ఇదిలా ఉండగా నటుడు పునీత్ మరణించడంతో కర్ణాటక ప్రభుత్వం హై అలర్ట్ విధించింది. హాస్పిటల్ ప్రాంతంతో పాటు వివిధ ప్రధాన కూడళ్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహించారు.ఈ క్రమంలోనే అతని మృతికి సంతాపం తెలియజేస్తూ కర్ణాటక ప్రభుత్వం రెండు రోజులపాటు థియేటర్లను మూసివేయాలని ఆదేశాలను జారీ చేసింది.
BREAKING :
— T2BLive.COM (@T2BLive) October 29, 2021
High alert declared in #Karnataka . Police battalions deployed. Govt ordered to close theatres immediately. #PuneethRajKumar #Bangalore
పునీత్ రాజ్ కుమార్ మరణం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు విక్రమ్ హాస్పిటల్ కు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. తమ అభిమాన నటుడు ఇకలేరన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతని మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

































