ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ పంపిణీ మొదలైన సమస్యలతో ప్రజలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయి ఉన్నారు. వీరిని ఆదరించడానికి ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు వారికి తోచిన విధంగా ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు.ఇదే కోవలో కర్ణాటక రాష్ట్రం లోని మైసూరుకి చెందిన హరీశ్ అనే వ్యక్తి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు.

వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం మైసూర్ కు చెందిన హరీష్ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అయినను తన కన్న కూతురీ వివాహాన్ని అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించాలని అనుకున్నాడు. దాని కోసం ఈ నెల 12న ముహూర్తం నిర్ణయించి బంధుమిత్రులను ఆహ్వానించాడు.
ఇంతలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అందులో భాగంగా వివాహ వేడుకలు, వివిధ శుభకార్యాల పైన కూడా ఆంక్షలు విధించడంతో హరీష్ చేసేదేమీలేక తన కూతురు వివాహాన్ని లాక్‌డౌన్ నిబంధనలను అనుసరించి తన ఇంట్లోనే సింపుల్ గా జరిపించాడు.
అయితే హరీష్ తన కూతురు వివాహం కోసం దాచిన డబ్బును లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు పంచాలని నిర్ణయించాడు.పెళ్లి కోసంఖర్చు చేయాలనుకున్న రెండు లక్షల రూపాయలను 40 మంది పేదలకు ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున ఇచ్చి వారికి సాయంగా నిలిచాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమకు తోచిన, చేతనైన సహాయం చేయాలని ప్రజలను కోరుతున్నాడు.






























