Karthika Deepam 2: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ దాదాపు ఆరు సంవత్సరాల పాటు ప్రసారమవుతూ రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో దీపా కార్తీకదీపం క్యారెక్టర్లకు ఎంతో మంది అభిమానులు పెరిగిపోయారు. ఇక దీప పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్ తెలుగు అమ్మాయి కాకపోయినా ఈమెకు మాత్రం మంచి ఆదరణ లభించింది.

ఇక ఈ సీరియల్ పూర్తి కావడంతో ఎంతోమంది నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈ సీరియల్ కి ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకున్నటువంటి డైరెక్టర్ ఈ సీరియల్ కి సీక్వెల్ గా కార్తీకదీపం 2 ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమవుతుంది. ఇక ఈ సీరియల్ కోసం దీప రెమ్యూనరేషన్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.
కార్తీకదీపం సీరియల్ లో ఈమె పాత్రకు భారీ స్థాయిలో డిమాండ్ ఉండడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈమె రోజుకు 35 వేల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. ఇలా ఈ సీరియల్ కోసం నెలకు సుమారు 20 రోజులకు పైగా పని చేస్తున్నారని తెలుస్తోంది.
నెలకు ఎనిమిది లక్షలు..
ఇలా నెలకు ఈ సీరియల్ ద్వారా 8 లక్షల వరకు ఆదాయం తీసుకుంటున్నటువంటి ఈమె సినిమా హీరోయిన్ల కంటే కూడా భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని చెప్పాలి. ఇలా ఈమె తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
































