Karthika Deepam Child Artists:బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్తీకదీపం సీరియల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ సీరియల్లో దీప, కార్తీక్, మోనిత పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సీరియల్ లో కార్తీక్ దీప పిల్లలుగా నటించిన హిమ శౌర్య పాత్రలు సైతం అదే స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఇక ఈ సీరియల్ లో కొద్దిరోజులపాటు కార్తీక్ దీప చనిపోయినట్టు చూపించి పిల్లలను కూడా పెద్దయినట్టు చూపించారు. అయితే ఇలా సీరియల్ మొత్తం మారిపోవడంతో ప్రేక్షక అభిమానులు ఈ సీరియల్ చూడటానికి ఇష్టపడలేదు.

ఇకపోతే ఈ సీరియల్ కు రేటింగ్ తగ్గిపోవడంతో తిరిగి సరికొత్త కథనం ద్వారా ఈ సీరియల్ లోకి దీప కార్తీక్ పాత్రలతో పాటు హిమాసౌర్యల పాత్రలను కూడా తీసుకోవచ్చారు. ప్రస్తుతం ఈ సీరియల్ పూర్వం లాగే రేటింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఈ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన హిమ శౌర్య సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా ఎన్నో డాన్స్ రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే స్టార్ మా లో జరిగినటువంటి పరివార్ వేడుకలలో భాగంగా ఈ చిన్నారులు వేదికపై అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ గురించి అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.

Karthika Deepam Child Artists: మాస్ పర్ఫామెన్స్ చేసిన హిమ..సౌర్య
ఈ విధంగా శౌర్య హిమ ఇద్దరూ కూడా వేదికపై మాస్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపారని చెప్పాలి. ఇలా వీరిద్దరూ డాన్స్ చేస్తూ ఉండగా సీరియల్ నటీనటులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ వీరి డాన్స్ ను ప్రోత్సహించారు. ప్రస్తుతం ఈ చిన్నారుల డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నారులు ఇతర సీరియల్స్ లో కనిపించకపోయిన సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఇంత చిన్న వయసులోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

































