Karthika Deepam Fame Sri Divya: బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటి. ఈ సీరియల్ కు రెండు రాష్ట్రాలలో విపరీతమైన ఆదరణ ఉంది. సాధారణంగా మగవారు సీరియల్స్ ను పెద్దగా చూడరు కానీ కార్తీకదీపం సీరియల్ కు మాత్రం ఆడవారు మగవారు ఇద్దరు పెద్ద అభిమానులుగా ఈ సీరియల్ లో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ సీరియల్ పనిమనిషి ప్రియమణి పాత్రలో నటించిన నటి శ్రీ దివ్యకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.ప్రియమణి పాత్రలో నటించిన ఈమెకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్లో డాక్టర్ బాబు వంటలక్కతో పాటు, విలన్ పాత్రలో నటించిన మోనిత పాత్రకు ఆమె దగ్గర పనిమనిషిగా నటించిన ప్రియమణికి కూడా అదే స్థాయిలో పాపులారిటీ వచ్చింది.

ప్రియమణి పాత్రలో నటించిన ఈమె అసలు పేరు శ్రీ దివ్య. సీరియల్ లో పనిమనిషి పాత్రలో నటించిన సోషల్ మీడియాలో ఈమె మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. తాజాగా ఈమె తన గ్లామర్ ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గ్లామరస్ బోల్డ్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ప్రియమణి…
ఇకపోతే ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది నెటిజన్లు అసలు కార్తీకదీపం సీరియల్ లో పనిమనిషి పాత్రలో నటించిన ప్రియమణినేనా ఇక్కడ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ప్రియమణి బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కార్తీకదీపం సీరియల్ నుంచి వీరందరూ తప్పుకోవడంతో ఈ సీరియల్ రేటింగ్స్ తగ్గాయనే చెప్పాలి. ఈ సీరియల్ వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత లేనిలోటు స్పష్టంగా కనబడుతోంది.
































