బుల్లితెర ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. పైగా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ ను అస్సలు మిస్ చేసుకోవటం లేదు. నిన్నటిదాకా కనిపించని మోనిత ఇప్పుడు కనిపించేసరికి మళ్లీ మరింత ఆసక్తిగా మారింది.

ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం. కార్తీక్.. రత్న సీతతో నాపై ఎందుకింత జాలి చూపిస్తున్నావ్ అని అడిగిన సంగతి తెలిసిందే. దాంతో రత్న సీత మీ గురించి విన్నాను.. మీరు మంచివాళ్లు అని విన్నాను అంటూ కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మరోవైపు భాగ్యం ఆలోచనల్లోనే ఉంటూ.. మురళి కృష్ణ కు అన్నం వడ్డిస్తూనే ఉంటుంది. మురళీకృష్ణ కూడా ఆలోచనలో ఉండేసరికి చూసుకోడు. ఇక తేరుకొని భాగ్యంని పిలిచి మాట్లాడుతాడు. ఇక భాగ్యం కార్తీక్, దీపాల గురించి మాట్లాడుతూ వారి పెళ్లి రోజుల గురించి తలుచుకుంటూ బాధపడుతుంది. మురళి కృష్ణ కూడా ఏడుస్తుండగా భాగ్యం నచ్చజెప్పి ఊరుకోపెడుతుంది.

ఇక కార్తీక్ కోసం సౌందర్య భోజనం తీసుకొస్తుంది. దీప ఎలా ఉంది అనగా.. యముడి నుండి భర్తను కాపాడుకున్న సతీసావిత్రిలా ఉంది. నీకోసం బాగా పోరాడుతుంది. నా భర్త తప్పు చేయలేదు అంటూ గట్టిగా మాట్లాడుతుంది అని దీప గురించి మాట్లాడుతుంది.

కార్తీక్ కూడా దీప గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పి అవన్నీ దీపతో చెప్పమని కబురు ఇస్తాడు. దీప నాపై నమ్మకంతో ఉంది అని.. నేను అదృష్టం గురించి చూస్తున్నాను అని అంటాడు.

ఇక దీప వారణాసితో అంజి కోసం కారు దగ్గర ఎదురు చూస్తారు. ఇక అంజి రాగానే కార్తీక్ గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడుతాడు. మోనితను తనే చంపాలనుకున్న విషయాన్ని తెలుపుతాడు. కానీ కార్తీక్ తొందర పడ్డాడని.. ఆ నేరాన్ని తనపై వేసుకుంటూ జైల్లో ఉంటానని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు.

వెంటనే దీప నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు.. నీవు మా కోసం అలా త్యాగం చేయడం సరైనది కాదు అంజి అని మాట్లాడుతుంది. కానీ అంజి తాను గతంలో జరిగిన కొన్ని విషయాలు చెబుతూ ఆ సమయంలో డాక్టర్ బాబు తనపై కోపం చూపించకుండా సహాయం చేస్తానని అన్నాడు అని అంటాడు.

మోనిత కోసం మీ జీవితాలను త్యాగం చేయకూడదు. కేవలం సహాయం చేస్తే చాలు అంటుంది దీప. డాక్టర్ బాబు ఇలా చేస్తాడని సాక్ష్యాల ద్వారా నమ్మాల్సి వస్తుందని అంటాడు. వెంటనే మోనితకు నేను కాకుండా మరెవరైనా శత్రువులు ఉన్నారేమో.. కార్తీక్ పై నేరం మోపారేమో అని అంటాడు.

వెంటనే దీపకు దుర్గా గుర్తొచ్చి అవును శత్రువు ఉన్నాడని.. కానీ డాక్టర్ బాబుపై అలా నింద వేయడని అంటుంది. ఇక దుర్గా గురించి అంజికి వివరిస్తుంది. అంజి కూడా దుర్గాన్ని వెతకతాడానికి సిద్ధంగా ఉంటాడు. వారణాసి అంజి దగ్గరికి వెళ్లి డాక్టర్ బాబు కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హ్యాట్సాఫ్ చెప్పి వెళ్ళిపోతాడు.

ఓ ఇంట్లో మౌనిక కొత్త గెటప్ లో సీరియస్ లుక్ లో ఉంటుంది. అక్కడికి వచ్చిన రత్న సీతను చూసి నా కార్తీక్ ఎలా ఉన్నాడు అంటూ.. ఫోటో చూపించు అని ఫోటోకు ముద్దులు పెడుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. రత్న సీతతో తన భర్త మందుల కోసం రాసిచ్చిన చిట్టిని చూసి కార్తీక్ రాసిన రాతలు అని తెగ మురిసిపోతుంది.

ఆ ఫోటోలు చూసుకుంటూ ఏవో మాట్లాడుతూ దీప పై మండిపడుతుంది. ఇక కార్తీక్ ను వదలను అంటూ ప్రపోజ్ చేస్తుంది. రత్న సీతకు డబ్బులు ఇచ్చి నువ్వు నా మనిషివని తెలియకుండా ఉండమని చెబుతుంది. తనకు ఈ గతి పట్టించినందుకు ఇకపై దీపను వదలను అంటూ గట్టిగా అరుస్తుంది.

ఇక తరువాయి భాగంలో పిల్లలు కార్తీక్ ను కలిసి ఎమోషనల్గా మాట్లాడుతారు. అంతలో రోషిణి వచ్చి.. రత్నం సీతపై అరుస్తూ.. ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలీదా అనేసరికి పిల్లలు రోషిణి వైపు కోపంగా చూస్తారు.































