దీపను చంపినట్టు కలగని పట్టుబడ్డ మోనిత.. రసవత్తరంగా మారిన కథ!

0
1376

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్.. మళ్లీ కథ మొత్తం మొదటికి వచ్చినట్లు అనిపిస్తుంది. దీపను చంపడానికి మారువేషంలో మోనిత వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ కథ సాగినట్లు ఉంది. ఇక ఈ సారి మోనిత ఏం చేయనుందో అని ప్రేక్షకులు టెన్షన్ పడుతున్నారు.

ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం.. గుడిలో దీప పూజ చేస్తున్న సమయంలో మోనిత గన్ తో షూట్ చేయడం.. దీప కింద పడిపోవడం చూశాం. కానీ ఈరోజు మోనిత షూట్ చేయకుండా.. నేరుగా నా ముందుకు వచ్చినప్పుడు గన్ గురి పెట్టి నేనెవరో నీకు చెప్పి అప్పుడు షూట్ చేస్తా అని అనుకుంటుంది.

సౌందర్య ఇంట్లో సౌర్య, హిమ తన తల్లి కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతుండగా.. వాళ్ల పిన్ని అమ్మకు ఏం కాదు అని ధైర్యం ఇస్తుంది. కాని పిల్లలు మాత్రం నాన్నకు ఇలా జరిగింది అని.. అమ్మ ఏమో ఎక్కడికో వెళ్ళింది అంటూ బాగా ఏడుస్తుంటారు. ఇక వాళ్ల పిన్ని వాళ్లను ఓదారుస్తుంది.

గుడిలో సోదమ్మలా కూర్చొని దీపకు వినిపించేలా అరుస్తుంది. మోనిత మాటలకు దీప ఆశ్చర్యపోతుంది. మోనిత మాత్రం తన మాటలతో దీపను నమ్మిస్తుంది. నీ ప్రాణాలు గాలిలో కలిసి పోతాయి అని మనసులో అనుకుంటుంది మోనిత. చేయని తప్పుకు నీ భర్త నిందలు మోస్తున్నాడని అంటుంది.

ఇక మధ్యలో మోనిత దుర్గా పేరు అని అనడంతో మళ్ళీ మాట మారుస్తూ దుర్గమ్మ గుడికి వెళ్ళు అని చెబుతుంది మోనిత. ఇక దీప గతంలో దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్తున్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటుంది. దీపను కళ్ళు మూసుకుని దండం పెట్టుకోమంటుంది మోనిత.

అదే సమయంలో మోనిత దీప ఎదురుగా గన్ తో గురి పెట్టగా.. వెంటనే మోనితకు తుమ్ము రావడంతో ఎక్స్క్యూజ్ మీ అనేసరికి వెంటనే దీప కళ్ళు తెరిచి చూస్తుంది. అదే సమయంలో దీప గుర్తుపట్టడంతో పక్కనున్న దుర్గను చూసి షాక్ అవుతూ అక్కడినుంచి పరిగెడుతుంది మోనిత.

ఇక అక్కడే ఉన్న అంజికి, దుర్గకు మోనిత సోదమ్మల వచ్చిందని.. తన చేతిలో గన్ ను చూశానని.. దుర్గ ని చూసి పారిపోయింది అంటూ చెప్పడంతో.. వాళ్లు నమ్మలేక పోతారు. ఇక దుర్గా దీపను ఇంటికి వెళ్ళమని చెబుతాడు.

మరోవైపు ఇంట్లో అందరూ దిగులుగా కనిపిస్తారు. ఇక భాగ్యం, మురళి కృష్ణ ను ఆదిత్య ఎందుకిలా పంపించారు అంటూ ప్రశ్నిస్తాడు. వెంటనే సౌందర్య.. దీప ఏదైనా దారి దొరుకుతుందేమో అని వెళ్ళింది అని అంటుంది.

ఇక దీప టెన్షన్ పడుతూ అత్తయ్య, మామయ్య అనుకుంటూ ఇంట్లోకి వస్తుంది. డాక్టర్ బాబు మోనితను హత్య చేయలేదు అంటూ.. మోనిత బ్రతికే ఉంది అని అనేసరికి అందరికీ కాస్త ధైర్యం అనిపిస్తుంది. ఎక్కడ కనిపించింది అంటూ భాగ్యం ప్రశ్నిస్తుంది.

మీరు నిన్న సోదమ్మ అన్నారు చూడు ఆమెనే మోనిత అనేసరికి అందరూ దీపకు ఏదో అయింది అన్నట్లు మొహాలు పెడుతుంటారు. ఇక ఆనందరావు మోనిత ఏంటి అని ప్రశ్నించగా.. తనకు గుడిలో జరిగిన విషయాన్ని మొత్తం వివరిస్తుంది.

అయినా కూడా ఇంట్లో వాళ్ళందరూ దీప మాటలు నమ్మలేకపోతున్నారు. ఇక దీప మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది. ఇక మురళి కృష్ణ వచ్చి మాకు సోదమ్మను చూస్తే అలా అనుమానం రాలేదు అనేసరికి అందరూ దీప మాటలను నమ్మలేకపోతున్నట్లు కనిపిస్తారు.

నువ్వు నీ భర్త కోసం దారి వెతుక్కుంటూ ఉన్నావు అని అందుకే ఇలా అవుతున్నావు అని అనేసరికి దీప ఏమి సమాధానం చెప్పకుండా మూగబోతుంది. ఏం సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్తూ.. ఎవరు నమ్మడం లేదు ఇదంతా భ్రమనా అంటూ తనకు తాను ప్రశ్నించుకుంటూ.. మానసిక స్థితి కూడా బాలేదా అనుకుంటూ వెళుతుంది.

అలా మాట్లాడుకుంటున్న దీప ను చూసి.. సౌందర్య.. చూశారా తనంతట తానే ఎలా మాట్లాడుకుంటూ వెళుతుందో అని అనేసరికి ఇంట్లో వాళ్ళంతా దీపకు ఏమో జరిగింది అని భయపడతారు.

ఇక తరువాయి భాగంలో కార్తీక్ దగ్గర కూడా మోనిత కనిపించింది అనే చెప్పేసరికి డాక్టర్ బాబు కూడా దీప మాటలను నమ్మలేకపోయాడు. కానీ అదే సమయంలో మోనిత ముసుగు వేషంలో వచ్చి కార్తీక్ కు టీ ఇవ్వగా.. మోనిత కార్తీక్ ను తాకుతుంది. వెంటనే కార్తీక్ ఇది మోనిత స్పర్శ అని అనుకుంటాడు.