మోనిత గురించి చెప్పకోలేక కుమిలిపోతున్న కార్తీక్.. 11:30 నిముషాలకు పెళ్లి ముహూర్తం ఫిక్స్?

0
71

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మళ్లీ మొదటికి వచ్చింది. కథ మొత్తం సాగడంతో ప్రేక్షకులు కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు. మోనిత బతికే ఉండేసరికి ఈ కథ ఇంకా సాగేలా ఉన్నట్లు అర్థమవుతుంది.

ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం. కార్తీక్ మోనిత మాటలను తలుచుకొని.. మోనితను చంపేయాలని అనుకుంటాడు. దీప ఏమవుతుందో అని భయపడతాడు. దీపను ఇక్కడ ఉండద్దని వెళ్ళిపోమని బ్రతిమాలుతాడు.

దీప మాత్రం వదిలి వెళ్ళను అంటూ మీకేం జరగదు అంటూ నేనున్నా అంటూ ధైర్యం ఇస్తుంది. కానీ కార్తీక్ మాత్రం మోనిత విషయం గురించి చెప్పకుండా లోలోపల తనను తాను మాట్లాడుకుంటూ కుమిలిపోతాడు. నాతోనే ఉండు అంటూ చిన్న పిల్లోడిలా మాట్లాడుతాడు.

మోనిత కడుపులో బిడ్డతో కాస్త ఓవర్ గా మాట్లాడుతుంది. నాన్నని చూసావా అంటూ కార్తీక్ గురించి మాట్లాడుతుంది. కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడుతూ తెగ ఫీల్ అవుతుంది.

ఇక ఇంట్లో సౌర్య, హిమ దగ్గర సౌందర్య కూర్చుంటుంది. ఇక సౌర్య.. తన తండ్రి గురించి ప్రశ్నించగా.. దీప గురించి వెటకారంగా మాట్లాడే సరికి సౌందర్య కోపం తో రగిలిపోతుంది. ఇక పిల్లలు ఇద్దరు సౌందర్యతో మాటల యుద్ధం చేస్తారు.

హాస్పిటల్లో కార్తీక్ కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతూ అక్కడున్న వారందరినీ అడుగుతుంది. ఇక కానిస్టేబుల్ కార్తీక్ అక్కడ ఉన్నాడు అని చెప్పే సరికి ఎందుకు అక్కడ కూర్చున్నాడు అంటూ అడుగుతుంది.

కార్తీక్ దగ్గరికి వెళ్లి ఏమైంది అనేసరికి.. కార్తీక్ భయపడుతూ ఎవరు లేక పోయేసరికి ఒంటరిగా ఉన్నాను అంటూ మాట్లాడుతాడు. మోనిత గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాను అని అనుకుంటాడు.

దీప అడుగుతున్న ప్రశ్నలకు కార్తీక్ సమాధానం చెప్పలేకపోతాడు. కార్తీక్ మాత్రం మోనిత గురించి చెప్పకుండా లోలోపలే కుమిలిపోతాడు. మోనిత గురించి చెబితే దీప ఏమౌతుందో అని చెప్పకుండా ఉంటాడు.

ఇక తన వల్ల అందరూ బాధపడుతున్నారు అంటూ అందరి గురించి చెబుతాడు. దీప తన కోసం పిచ్చి గా అయిపోతుంది అంటూ అంటాడు. తన నమ్మకం గురించి మాట్లాడుతూ బాధపడుతున్నాను అంటూ తెలుపుతాడు.

తరువాయి భాగం లో వెళ్తున్న దీపని ఆపి నువ్వంటే నాకు ఇష్టం దీప అంటూ ఎమోషనల్ గా చెబుతాడు. మోనిత తాళిబొట్టు పట్టుకొని 11:30 కి వస్తాను అంటూ రత్న సీతతో చెబుతుంది. ఇక దీప కూడా ఇంట్లో వాళ్లకి 11 గంటలకు అని ఏదో విషయం గురించి చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here