Karthika Deepam Shobhashetty: బుల్లితెరపై ప్రసారం అవుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి టాప్ రేటింగ్ లో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ ద్వారా దీప పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్, కార్తీక్ పాత్రలో నటించిన నిరుపమ్, మోనిత పాత్రలో నటించిన శోభా శెట్టికి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.

ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటించిన మోనిత అలియాస్ శోభా శెట్టి ఇది వరకు ఎన్నో సీరియల్స్ లో నటించిన రాని గుర్తింపు కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సీరియల్లో సూర్పనఖ తరహా పాత్రలో నటించిన మోనిత తన విలనిజంతో అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది.

ఈ విధంగా కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం ఈ సీరియల్ లో తర్వాత జనరేషన్ ప్రారంభం కావడంతో సీరియల్ నుంచి తప్పుకుంది. ఈ విధంగా ఈ సీరియల్ నుంచి దూరమైన శోభా శెట్టి సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.సోషల్ మీడియా వేదికగా తన ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ నిత్యం అభిమానులను సందడి చేస్తున్నారు.
విలన్ గా భయపెట్టిన మోనిత..
ఇక శోభా శెట్టి ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా శోభా శెట్టి తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే సీరియల్స్ లో సూర్పణక పాత్రలలో నటిస్తూ విలన్ గా ముద్ర వేయించుకున్న శోభా శెట్టి తాజాగా సీతమ్మ గెటప్ వేసి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం శోభా శెట్టి సీత పాత్రకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

































