Karthika Deepam Soundarya: నరేష్ పవిత్ర లోకేష్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన కార్తీకదీపం సౌందర్య… ఎవరికి హక్కు లేదంటూ కామెంట్స్!

0
210

Karthika Deepam Soundarya:నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ఒక్కసారిగా సంచలనంగా మారారు. వీరిద్దరు వ్యక్తిగతంగా రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ సినిమా ద్వారా వీరిద్దరూ ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారని చెప్పాలి.

ఇలా లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగితేలుతో సైలెంట్ గా ఉండకుండా ఈ జంట తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా చెబుతూ అందరి ముందు కాస్త చులకనగా అయ్యారనే చెప్పాలి.ఇక మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వేదికపై వీటి ఇద్దరు చేసిన రొమాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

వ్యవహార శైలి వల్ల దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర లోకేష్ గురించి వస్తున్నటువంటి ఈ కామెంట్లపై కార్తీకదీపం నటి సౌందర్య స్పందించారు.కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య పాత్రలో నటించిన నటి అర్చన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈమె సినిమాలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Karthika Deepam Soundarya: తల్లిదండ్రులకు కూడా హక్కు లేదు..


ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర లోకేష్ గురించి వస్తున్నటువంటి కామెంట్లపై సౌందర్య స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ గురించి ఇలాంటి వార్తలు రావడం తనని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని తెలిపారు. వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇలా వారు ఒకరినొకరు ఇష్టపడటం అనేది వారి వ్యక్తిగత విషయం.వారి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు చివరికి తల్లిదండ్రులకు కూడా ఆ హక్కు లేదు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.