బాహుబలి సినిమాలో ప్రభాస్ తర్వాత ఎక్కువగా పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది కట్టప్ప మాత్రమే. మొదటి భాగంలో అయినా రెండో భాగంలో అయినా అతడి రోల్ అద్భుతంగా ఉంటుంది. అయితే కట్టప్ప క్యారెక్టర్ చేసిన సత్యరాజ్ తమిళంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు.

తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో తండ్రిగా, మామగా , తాతగా ఎన్నో క్యారెక్టర్లు చేశాడు.. చేస్తున్నాడు కూడా. సత్యరాజ్ కు తెలుగులో ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం అతడిని సత్యరాజ్ అని కాకుండా కట్టప్ప అనే పిలుస్తున్నారంట. ఎప్పుడూ.. ఎక్కడా రాని ఫేమ్ రాజమౌళి పుణ్యమా అని అతడికి బాహుబలి ద్వారా దక్కింది. దీంతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు.

ఇదిలా ఉండగా.. సత్యరాజ్ కు ఒక కొడుకు.. ఒక కూతురు ఉన్నారు. కొడుకు ఇప్పటికే తమిళంలో పలు సినిమాలకు హీరోగా కూడా చేశారు. కూతురు దివ్య కూడా సినిమాల్లోకి రావాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇప్పటికే ఆమె షార్ట్ ఫిలిమ్స్ తీస్తుండగా.. ఆమె కూడా తన నాన్న సినిమాలో ఫేమస్ కావడంతో సినిమాలో నటించేందుకు ఇష్టపడుతుందట.

బాహుబలి తర్వాత కూడా అతడు తెలుగులో పలు సినిమాల్లో నిటించారు. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ప్రతీ రోజు పండగే’ సినిమాలో హీరో తాతగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా అతడు బాహుబలి కంటే ముందు కూడా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. నేను శైలజ, హైపర్, మిర్చి వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించి మెప్పించారు.



























