తెలంగాణ రాష్ట్రంలో విమానాలు దిగేందుకు అనుమతి లేదని కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణాలో ఒకే ఒక్క ఎయిర్ పోర్టు అదికూడా హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మత్రమే ఉంది అయితే అక్కడ నుంచి పెద్దఎత్తున రాకపోకలు జరుగుతాయి. ఈ క్రమంలో మే 7 వ తేదీ వరకు ఎటువంటి విమానాలను అనుమతించమని స్పష్టం చేసారు కేసీఆర్. అయితే దీనిపై జీఎంఆర్ సంస్థను కూడా విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.

తెలంగాణలో లాక్ డౌన్ ను మే 7 వ తేదీవరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుతం. కేంద్రం విధించిన లాక్ డౌన్ మే 3 తో ముగిసినా.. తెలంగాణలో మాత్రం మే 7 వరకు కొనసాగుతుందని తెలిపారు కేసీఆర్. మరోవైపు ఏప్రిల్ 20 నుంచి ఎటువంటి లాక్ డౌన్ సడలింపులు ఉండబోవని స్పష్టం చేసారు కేసీఆర్.
































