Keerthy Suresh: సినీనటి కీర్తి సురేష్ వివాహం జరగబోతోంది అంటూ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. నేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ భాష చిత్రాలలో నటిస్తూ హీరోయిన్ గా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా ఎన్నో వార్తలు వినిపించాయి.

ఈ విధంగా కీర్తి సురేష్ గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో ఆమె ఈ వార్తలపై స్పందించి ఈ వార్తలను ఖండించారు. ఒకానొక సమయంలో కీర్తి సురేష్ తండ్రి కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. కీర్తి సురేష్ పెళ్లి గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని ఒకవేళ అలా తన పెళ్లి చేసుకుంటే కనుక ముందుగా ఈ విషయాన్ని నేనే మీకు తెలియజేస్తానని తెలిపారు.
అప్పటినుంచి ఈ వార్తలకు కాస్త పులి స్టాప్ పడినా, గత మూడు రోజులుగా ఈ పెళ్లి గురించి మరోసారి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ తండ్రి స్పందించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ మాట్లాడుతూ కీర్తి సురేష్ వివాహం తనకు 15 సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి ఆంటోని తట్టిల్ తో డిసెంబర్ నెల 11వ తేదీ గోవాలోని ఒక రిసార్ట్ లో జరగబోతుందని తెలిపారు.

Keerthy Suresh:
ఈ విధంగా ఈయన తన కుమార్తె పెళ్లి గురించి అధికారకంగా ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా కీర్తి ఆంటోని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. ఇక ఆంటోనీ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.




























