KGF Actor Avinash: ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోజురోజుకి వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇలా ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అదృష్టం కొద్దీ కొంతమంది ప్రాణాలతో బయటపడిన కూడా జీవితాంతం ఆ ప్రమాదాల తాలూకా గుర్తులు వెంటాడుతూ ఉంటాయి.

తాజాగా ప్రముఖ సినీ నటుడు కేజిఎఫ్ నటుడు అవినాష్ కారుకి ప్రమాదం జరిగింది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలో నటించి బాగా పాపులర్ అయిన అవినాష్ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు నిన్న ఉదయం జిమ్ నుండి తిరిగి వస్తుండగా ట్రక్కు ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ.. అవినాష్ చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయాన్ని అవినాశ్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు.

నిన్న నేను జీవిత కాలానికి సరిపడా భయం చూశాను.జిమ్ నుండి తిరిగి వస్తుండగా అనిల్ కుంబ్లే దగ్గర అనుకోకుండా క్షణాల్లో ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రక్కు రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి వచ్చి నా కారుని గుద్దాడు. అయితే ఈ ఘటనలో అదృష్టం కొద్దీ నేను ప్రాణాలతో బయటపడ్డాను. కానీ నా కారు బాగా డ్యామేజ్ అయ్యింది అంటూ అవినాశ్ చెప్పుకొచ్చాడు.
అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు…
ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్కు మీద పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తృటిలో ప్రమాదం నుండి బయట పడిన అవినాష్ తనకి సహాయం చేసిన వారికి ధన్యవాదాలు తెలియచేశాడు. అంతే కాకుండా తనకి తోడుగా ఉన్న కుటుంబ సభ్యులకు, స్నేహితులకి కూడా కృతజ్ఞతలు తెలియజేశాడు. అవినాశ్ ప్రమాదం గురించి తెలుసుకున్న యశ్, ప్రశాంత్ నీల్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయన తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.
































