కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శ కత్వంలో తెరకెక్కిన “కేజిఎఫ్” చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన సృష్టించింది. ఈ చిత్రం సాధించిన విజయం యావత్ ప్రపంచాన్ని కన్నడ సినీ పరిశ్రమ వైపు చూసేలా చేసింది. బాక్సాఫీస్ వద్ద అంత పెద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ చిత్రంగా “కేజిఎఫ్ చాప్టర్ 2” చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని హోంబలె పిక్చర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన శాటిలైట్ హక్కులను జీ సంస్థ వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని జీ సంస్థ వారు ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేశారు.





























