Kiara Advani: ఎస్ జె సూర్య ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా దర్శకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించినటువంటి ఈయన ప్రస్తుతం డైరెక్షన్ కి గుడ్ బై చెబుతూ నటుడిగా స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే పలు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ విలన్ పాత్రలలో అందరిని మెప్పిస్తున్నారు.

తాజాగా ఈయన శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కియారా ప్రధాన పాత్రలలో నటిస్తున్నటువంటి పాన్ ఇండియా చిత్రం గేమ్ చెంజర్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే నటి కియారా పుట్టినరోజు కావడంతో ఈయన తనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా కియారకు ఈయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ హ్యాపీ బర్త్ డే ప్రీటి ప్రిన్సెస్..శ్రీదేవి తర్వాత అంతటి ప్రతిభావంతురాలైన నటి మీరే అంటూ ఈయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా కియారాను ఏకంగా శ్రీదేవి గారితో పోల్చడం కొందరు అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.

Kiara Advani: జాన్వీ ఎవరు…
ఈమె కన్నా ఇండస్ట్రీలో ఎంత ప్రతిభవంతులైనటువంటి నటీమణులు ఉన్నారు కానీ ఈమెను శ్రీదేవి గారితో పోల్చడం ఏంటి అంటూ ఈ పోస్ట్ పై కామెంట్ చేస్తున్నారు. మరి కియారా శ్రీదేవి అయితే జాన్వీ కపూర్ ఏంటి అంటూ శ్రీదేవి అభిమానులు పెద్ద ఎత్తున ఈ పోస్టుపై విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్ జె సూర్య చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
Happy Birthday Pretty Princess @advani_kiara 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 after Sridevi mam, the prettiest talented actress U r 🥰🥰🥰🥰 have a great year 🥰🥰🥰🥰🥰🥰🥰💐💐💐💐💐💐💐💐sjs pic.twitter.com/okRpdaxxVo
— S J Suryah (@iam_SJSuryah) July 31, 2023