Sudeep: భారతదేశం విభిన్న జాతుల కలయిక అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే భిన్నత్వంలో ఏకత్వంలా భారత దేశంలో ఎన్నో రకాల మతాలు భాషలు మాట్లాడే వారు ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఒకే దేశం ఒకే భాష అనే నినాదం వినబడుతోంది.

ఈ క్రమంలోనే ఎంతో మంది రాజకీయ నాయకులు జాతీయ భాషయిన హిందీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఈ విషయం పై పలువురు సెలబ్రిటీలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా కన్నడ స్టార్ నటుడు సుదీప్ హిందీ సినిమాల గురించి హిందీ భాష గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కేజీఎఫ్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే హిందీ భాష గురించి మాట్లాడుతూ హిందీ జాతీయ భాష కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే బాలీవుడ్ చిత్రాలపై కూడా ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సౌత్ లో ఆదరణ లేదు…
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్నాయి. అయితే ఆ సినిమాలు సౌత్ ఇండస్ట్రీలో ఏమాత్రం ఆదరణ పొందలేదు. ఈ విషయంపై బాలీవుడ్ హీరోలు సైతం సందేహాలను వ్యక్తం చేశారు. కానీ మన సౌత్ ఇండస్ట్రీ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్నాయంటూ సుదీప్ హిందీ భాష, హిందీ చిత్రాల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాయి.































