Kirak RP: తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమందికి నటీనటులు పరిచయం అయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి గుర్తింపుని, అభిమానులని సంపాదించుకొని సినిమాలలో కూడా దూసుకుపోతున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా పరిచయం అయ్యి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కిరాక్ ఆర్పీ కూడా ఒకరు. తనదైన శైలిలి కామెడీ స్కిట్లు చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. జబర్దస్త్ నుంచి దూరం అయ్యి దర్శకుడిగా జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో సినిమా కూడా తీస్తున్నాడు. అయితే ఆర్పీ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు.

ఇటీవల ఆర్పీ ప్రేమించిన అమ్మాయి అయిన లక్ష్మి ప్రసన్న తో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే చాలా మందికి, వీరు ఎలా పరిచయం అయ్యారు, ఎప్పుడు ప్రేమించుకున్నారు అన్న సంగతి తెలియదు. అయితే ఇటీవల ఒక ప్రోగ్రాం లో ఆర్పీ, లక్ష్మి ప్రసన్నతో కలసి స్టేజిర్ మీద వారి ప్రేమ కథను పాట రూపంలో చూపించారు.
తన ప్రేమకథకు స్టేజ్ మీద డాన్స్…

తాజాగా మా టీవీ లో ‘పార్టీ చేద్దాం పుష్ప’ అనే కార్యక్రమం ప్రసారం అయ్యింది. అయితే ఈ కార్యక్రమంలో కిరాక్ ఆర్పీ తన ప్రేమ కథ మొత్తాన్ని ఒక పాట రూపంలో చూపించారు. ఆ పాటలో మరో విశేషం ఏమిటంటే ఆర్పీ- లక్ష్మీ ప్రసన్న డాన్స్ చేయడం. అయితే ఆ పాటకు వాళ్లిద్దరూ బాగా ప్రాక్టిస్ చేసి మరి ప్రోగ్రాంలో చేశారు. వారి ప్రాక్టీస్ వీడియోని కిరాక్ ఆర్పీ తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ కూడా చేశాడు. ప్రస్తుతం ఆర్పీ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.































