Kiran Abbavaram: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా ఈయన తన మొదటి సినిమా రాజా వారు రాణి గారు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్గా రహస్య గోరక్ నటించారు.

ఇలా ఈ సినిమా ద్వారా వీరిద్దరి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఎవరికి తెలియకుండా గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ వచ్చారు. అయితే వీరి ప్రేమ గురించి వార్తలు వచ్చిన వీటిని ఖండిస్తూ వచ్చారు. ఇకపోతే గత రెండు మూడు రోజుల నుంచి వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇలా వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకోబోతున్నారని వార్తలు వస్తున్నటువంటి తరుణంలోని వీరిద్దరూ బుధవారం సాయంత్రం అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ నిశ్చితార్థపు వేడుకలను జరుపుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆగస్టులోనే పెళ్లి..
ఈ విధంగా కిరణ్ రహస్యల నిశ్చితార్థపు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ జంట ఆగస్టు నెలలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కిరణ్ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి కాగానే ఈయన పెళ్లి చేసుకుని. ఇండస్ట్రీకి కొంత బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

































